తెరపైకి దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్త.. పెళ్లికూతురు ఎవరంటే..

Recommended Video

Devi Sri Prasad Marriage News Goes Viral | Filmibeat Telugu

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఒకరు. పలు దఫాలు ఆయన అఫైర్లు, పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే అవి ప్రేమ, పెళ్లి పీటల మీదకు రాలేకపోయాయి. కెరీర్‌‌తోనే ప్రేమలో పడిన దేవీ పెళ్లి వార్తలు మరోసారి మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇంతకీ పెళ్లి ఎవరితో? ఎప్పుడు? నిజమేనా అనే విషయాల్లోకి వెళితే..

గతంలో అఫైర్ వార్తలు

గతంలో అఫైర్ వార్తలు

గతంలో ప్రముఖ సినీ తారలతో దేవీ శ్రీ పెళ్లి వార్తలు వచ్చాయి. చార్మీతో పెళ్లి అంటూ మీడియా వారికి శుభలేఖలు కూడా రాశాయి. కానీ వారిద్దరి మధ్య అఫైర్ అక్కడితోనే ఆగిపోయిందని చెప్పుకొంటారు. ఆ తర్వాత కొందరి హీరోలతో అఫైర్లు అని మీడియాలో ప్రచారమైంది.

పూజితతో పెళ్లి అని

పూజితతో పెళ్లి అని

అలా దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్తలు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో దర్శనమిస్తుంటాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. పూజిత అనే సినీ తారను దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడం గమనార్హం.

ఎవరీ పూజిత అంటే

ఎవరీ పూజిత అంటే

ఇక ఇంతకీ ఎవరీ పూజిత అంటే రంగస్థలంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది. ప్రకాశ్ రాజ్ కూతురిగా, ఆది పినిశెట్టికి లవర్‌గా నటించింది. అయితే పూజితకు దేవీ శ్రీ ప్రసాద్‌ పరిచయం అక్కడే జరిగిందా? లేక కుటుంబపరంగా పెళ్లి కుదిరిందా అనే విషయం తెలియడం లేదు.

పెళ్లివార్తలో వాస్తవం ఉందా?

పెళ్లివార్తలో వాస్తవం ఉందా?

అందులో ఎంత వాస్తవముందో కొద్ది రోజులు ఆగితే తెలియడం ఖాయం. రంగస్థలం, భరత్ అనే నేను లాంటి బ్లాక్‌బస్టర్‌తో కెరీర్ పరంగా దేవీశ్రీ ప్రసాద్ దూసుకెళ్తున్నాడు. మరోసారి రాంచరణ్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న వినయ విధేయ రామ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X