రెండో పెళ్లికి సిద్దమవుతున్న ధనుష్... అమ్మాయి ఎవరో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకులకు సిద్ధమైన ధనుష్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆయనను రెండో పెళ్లి చేసుకొనున్న అమ్మాయి ఎవరు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
కోలీవుడ్‌లో స్టార్ హీరో ధనుష్. 2004లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ధనుష్‌ని వివాహం చేసుకున్న తర్వాత, అతని సోదరుడు సెల్వరాఘవన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఐశ్వర్య 2012లో విడుదలైన 3 చిత్రాలతో దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఆమె దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 3 లోని వై దిస్ కొలవెరీ పాట విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. పాటలు హిట్ అయినంతగా సినిమా హిట్ కాలేదు. దీంతో ఐశ్వర్య తొలి సినిమా ఫ్లాప్ అయ్యింది. ఐశ్వర్య రజనీకాంత్ ఆ తర్వాత గౌతమ్ కార్తీక్ నటించిన వై రాజా వాయ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధనుష్ క్లైమాక్స్‌లో కోకి కుమార్‌గా కనిపించి మాస్‌గా నటించాడు. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
దీంతో ఐశ్వర్య సినిమాలకు విరామం ఇచ్చి పర్సనల్ లైఫ్ పై దృష్టి సారించింది. అంతే కాకుండా ఫిట్‌నెస్‌పై ఆసక్తి కనబరుస్తూ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూనే ఉంది. మరోవైపు ధనుష్ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న ధనుష్, ఐశ్వర్యల జీవితంలో ఒక్కసారిగా విడాకుల కలకలం రేగింది.
2022లో విడాకులు తీసుకుని విడిపోబోతున్నట్లు ప్రకటించారు ఈ స్టార్ కపుల్. ధనుష్ ఐశ్వర్య తీసుకున్న ఈ నిర్ణయం రజనీతో పాటు చాలా మందికి షాక్ తగిలింది. ఇరువైపులా బంధువులతో చర్చలు జరిపి విడాకుల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ధనుష్, ఐశ్వర్య రెండేళ్ల తర్వాత విడాకుల కోసం కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఇక వీరిద్దరు కనెక్ట్ అయ్యే అవకాశం లేదనేది కోర్టు మెట్లు ఎక్కడంతో ఖాయం అన్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా కొడుకు మనసు మార్చాలని ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఆయన తన కొడుకు రెండో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో అమ్మాయిలు వద్దు అని డిసైడ్ అయ్యి, ఇప్పుడు చూట్టాలలో అమ్మాయిలని చూస్తున్నాడని కూడా అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు.


Click it and Unblock the Notifications











