స్టార్ హీరో, హీరోయిన్ సహజీవనం.. లేటు వయసులో ఒకే ఫ్లాట్‌లో..!
బాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా అంటే యువతకు శృంగార దేవత లాంటి ఇమేజ్ ఉండేది. సినీ దిగ్గజం రాజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన బాబీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన డింపుల్.. ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా మారిపోయారు.
గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకొన్న డింపుల్ కాపాడియాతో చాలా మంది హీరోలతో అఫైర్ వార్తలు వచ్చాయి. అయితే చివరకు సూపర్ స్టార్ రాజేశ్ ఖాన్నాతో పెళ్లి తర్వాత వాటికి కొంత పుల్ స్టాప్ పడింది. అయితే 65 ఏళ్ల స్టార్ హీరోయిన్‌పై డేటింగ్ వార్తలు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

14 ఏళ్లలో బాలీవుడ్ ఎంట్రీ: డింపుల్ కాపాడియా విషయానికి వస్తే.. ఆమె కేవలం 14 వయసులోనే అంటే 1971 సంవత్సరంలో వెండితెరను ఏలేసింది. రాజ్ కపూర్ దర్శకత్వంలో బాబీ సినిమాలో నటించిన తర్వాత తనకంటూ గ్లామర్ సామ్రాజ్యాన్ని సృష్టించుకొన్నది. ఆ సమయంలో అగ్రహీరోలందరూ డింపుల్ డేట్ల కోసం పడిగాపులు పడేవారు. చివరకు 1973లో రాజేశ్ ఖాన్నాను వివాహం చేసుకొన్నది.
రాజేశ్ ఖాన్నాతో దాంపత్య జీవితం: అయితే రాజేశ్ ఖాన్నాతో దాంపత్య జీవితం దాదాపు 10 ఏళ్లపాటు సాగింది. ఆ తర్వాత వారి వివాహ జీవితంలో విభేదాలు రావడంతో రాజేశ్ ఖాన్నా నుంచి విడాకులు తీసుకొన్నది. ఆ తర్వాత 1984లో సాగర్ సినిమాలో నటించడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మళ్లీ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇద్దరు పీకల్లోతు ప్రేమలో: హిందీలో సాగర్ మూవీ తర్వాత సన్నిడియోల్‌తో వరుసగా సినిమాల్లో నటించింది. వారిద్దరూ అర్జున్, మంజిల్ మంజిల్, ఆగ్ కా గోలా, గునా, నరసింహా చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో సన్నీడియోల్, డింపుల్ కాపాడియా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. డింపుల్ కాపాడియాతో అఫైర్ విషయాన్ని సన్నీ డియోల్ మాజీ లవర్ అమృతా సింగ్ కూడా ధృవీకరించింది.
డింపుల్‌ను రహస్యంగా వివాహం: సన్నిడియోల్, డింపుల్ కాపాడియా అఫైర్‌కు రాజేశ్ ఖాన్నా, ఆమె పిల్లలు ట్వింకిల్ ఖాన్నా, రింకీ ఖన్నా కూడా సపోర్ట్ చేశారు. అయితే అప్పటికే ఎన్నారైను పెళ్లి చేసుకొన్న సన్నిడియోల్, మళ్లీ డింపుల్‌ను రహస్యంగా వివాహం చేసుకొన్నారనే వార్త అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత పలు పార్టీల్లో, ఈవెంట్లలో డింపుల్‌ను తన అర్ధాంగి అని కూడా పరిచయం చేశారనే వార్తలు మీడియాలో కనిపించాయి.

ఫ్లాట్‌లో సహజీవనం: అయితే సన్నిడియోల్, డింపుల్ కాపాడియా మధ్య రిలేషన్‌షిప్ ఇంకా కొనసాగుతున్నది. వారిద్దరూ ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉండటానికి కొత్తగా ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు అంటూ ఉమేర్ సంధూ అనే క్రిటిక్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో వారిద్దరి అఫైర్ విషయం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.


Click it and Unblock the Notifications











