బుచ్చిబాబుకి భారీగా రెమ్యునరేషన్ నిజమేనా.. అసలు నిజం అదేనట?
సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సానా బుచ్చిబాబు తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి మంచి దర్శకుడిగా మార్కులు అందుకున్నాడు. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎవరు ఊహించని విధంగా సినిమాను అనేక మలుపులు తిప్పి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడు. చదువుకునే రోజుల్లో సుకుమార్ దగ్గర లెక్కలు నేర్చుకున్న బుచ్చిబాబు అదే సుకుమార్ దగ్గర దగ్గర సినిమాలలో మెళకువలు నేర్చుకుని గురువుకు తగ్గ శిష్యుడుగా మారాడు.
అయితే ఆయన రెండో సినిమాకు దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ వర్గాల్లో జరిగింది. అయితే అది నిజం కాదని అంటున్నారు, వివరాల్లోకి వెళితే

ఉప్పెన క్రేజ్ తో
దర్శకుడు సుకుమార్ వద్ద వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు ఈ ఏడాది ఫిబ్రవరి నెల 11వ తేదీన విడుదలైన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా మీద నమ్మకం ఉంచి నిర్మాతలు సినిమాను ఏడాది పాటు వాయిదా వేసి ఈ ఏడాది రిలీజ్ చేశారు.

నమ్మకాన్ని నిలబెట్టింది
దర్శక నిర్మాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. తక్కువ ఖర్చు తో తెరకెక్కిన ఈ సినిమా భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించి దర్శకుడితో పాటు హీరో, హీరోయిన్స్ కి మంచి అవకాశాలు తెచ్చిపెట్టింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.. అలాగే కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయింది. తోటలో రాముడు కోటలో రాణి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

అందుకే మొదలయి ఉండచ్చు
మొదటి సినిమాతోనే ఇంతటి సూపర్ హిట్ అందించిన బుచ్చిబాబు కు నిర్మాతలు తమ బ్యానర్ లోనే రెండో సినిమాకి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.. అయితే రెండో సినిమాకు ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు జీఎస్టీ కూడా ఆయనకు ఇస్తున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే ఇది అంత నమ్మశక్యంగా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో బాగా పెరిగిందని, బహుశా అందువల్లనే ఆయనకు ఇంతలా రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే వార్తలు బయటకు వచ్చి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది.

ఎన్టీఆర్ తో సినిమా
నిజానికి ఉప్పెన సూపర్ హిట్ అయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బుచ్చి బాబుకు కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తర్వాత సినిమాకి 8 కోట్ల పారితోషికం కూడా మొదలు అయి ఉండవచ్చు అనే వాదన వినిపిస్తోంది. మంచి హిట్ కొట్టడంతో ఇతర నిర్మాణ సంస్థలు కూడా బుచ్చిబాబుకి టచ్ లోకి వెళ్లి ఉండొచ్చు కానీ ఏకంగా రెండో సినిమాకి 8 కోట్ల పారితోషికం అనేది ఒక పుకారు అయి ఉండవచ్చని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. బుచ్చిబాబు తర్వాత సినిమా ఎన్టీఆర్ తో ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











