twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోయిన్‌తో దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడి రెండో పెళ్లి

    |

    ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి పెళ్లి వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగులో దర్శకుడిగా ప్రకాశ్ రంగ ప్రవేశం చేసి బాలీవుడ్‌పై ప్రస్తుతం దృష్టిపెట్టారు. గత కొద్దికాలంగా ఒంటరిగా ఉంటున్న ప్రకాశ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలకు హీరోయిన్ అనుష్క శెట్టి పేరు జోడించడంతో మీడియా, సినీ పరిశ్రమలో ఈ విషయం చర్చనీయాంశమైంది. ప్రకాశ్ పెళ్లి వార్తల వెనుక అసలు కారణం ఇదే..

    నటుడిగా, దర్శకుడిగా

    నటుడిగా, దర్శకుడిగా

    దర్శకుడు రాఘవేంద్రరావు వారసుడిగా నీతో సినిమా ద్వారా నటుడిగా ప్రకాశ్ తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఆ తర్వాత మార్నింగ్ రాగ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే నటుడిగా నిలదొక్కుకోకపోవడంతో దర్శకుడిగా మారిపోయారు. 2004లో బొమ్మలాట సినిమా ద్వారా ప్రకాశ్ దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో, ఆ తర్వాత హిందీలో జడ్జిమెంటల్ హై క్యా అనే చిత్రాలను రూపొందించారు.

    కనికతో పెళ్లి.. విడాకులు

    కనికతో పెళ్లి.. విడాకులు

    హిందీలో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో రచయిత కనిక ధిల్లాన్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. అయితే అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ప్రకాశ్, కనిక విడిపోయారు. ఆ విషయం సినీ పరిశ్రమలో చర్చకు దారి తీసింది. అప్పటి నుంచి ప్రకాశ్ ఒంటరిగానే ఉంటున్నారు.

    అనుష్కతో అఫైర్ అంటూ

    అనుష్కతో అఫైర్ అంటూ

    ఇక అనుష్కతో ప్రకాశ్‌కు అఫైర్ కొనసాగుతున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. సైజు జీరో సినిమా సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ముదిరిందనేది తాజా కథనాలు వెల్లడిస్తున్న విషయం. అయితే ఇప్పటికే అనుష్క పెళ్లి విషయంలో అనేక రూమర్లు మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ప్రకాశ్‌తో పెళ్లి వార్తలో ఎంత నిజమున్నదనే విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    Recommended Video

    Shruti Haasan Hangs Out With Rana Daggubati || Filmibeat Telugu
     నిశ్శబ్దంగా అనుష్క

    నిశ్శబ్దంగా అనుష్క

    ఇక అనుష్క కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం నిశ్శబ్దం అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ కానున్నది. ఇక ప్రకాశ్ విషయానికి వస్తే.. జడ్జిమెంటల్ హై క్యా అనే చిత్రం తర్వాత మరో సినిమా చేస్తున్నట్టు వార్తలేమీ బయటకు రాలేదు.

    English summary
    Once again Anushka Shetty marriage news goes viral. Reports suggest that Director Prakash Kovelamudi is in affair with the baahubali actress. They making plans for the marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X