మహేష్ బాబు లేటెస్ట్ 'దూకుడు'పై ఆ రూమర్ స్టార్ట్ అయ్యింది
మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు' ఫస్ట్ లుక్ ప్రోమో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రోమో చూసిన వారంతా దాన్ని పోకిరికి సీక్వెల్ ని అంటున్నారు. దాంతో ఈ చిత్రం పోకిరికి కంటిన్యూషన్ అంటకదా అనే రూమర్ స్టార్ట్ అయ్యింది. ఓ టీవి ఛానెల్ వారు పోకిరి సీక్వెల్ అంటూ ఈ రూమర్ తో ఆవేశంగా ఓ పోగ్రామ్ చేసేసారు కూడా. ఇక ఈ ఆలోచన రావటానికి కారణం ఈ ట్రైలర్ లో చెప్పిన డైలాగు అంటున్నారు. పోకిరిలో హిట్ అయిన ఎవర్ గ్రీన్ డైలాగ్..నేను ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విననుని మార్చి 'మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా" అని డైలాగు రాసారు. ఇక ఈ చిత్రానికి మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ పరంగానూ బాగా వర్క్ చేసినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











