తమన్నాతో బ్రేకప్.. ఆ హీరోయిన్‌తో విజయ్ వర్మ డేటింగ్? రొమాన్స్ చేస్తూ దొరికిన హీరో

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా- విజయ్ వర్మల బ్రేకప్‌ చిత్ర సీమకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. రేపో మాపో శుభవార్త చెబుతారని భావించిన ఈ జంట మూడేళ్ల ప్రేమాయణానికి వీడ్కోలు చెప్పేసింది. వీరి మధ్య మనస్పర్ధలకు కారణం ఏమై ఉంటుందనేది నేటి వరకు తెలియరాలేదు. కానీ ఎవరికి నచ్చినట్లు వాళ్లు కథలు అల్లేస్తున్నారు. బ్రేకప్ తర్వాత తమన్నా, విజయ్ వర్మలు వారి వారి ప్రాజెక్ట్స్‌లో బిజీ అయ్యారు. తాజాగా విజయ్ వర్మకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

లస్ట్‌స్టోరీస్ 2 షూటింగ్‌లో ప్రేమాయణం
లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ షూటింగ్ కోసం విజయ్ - తమన్నాలు తొలుత సెట్‌లో కలుసుకున్నారు. విజయ్ వ్యక్తిత్వం, మాటతీరు, కేరింగ్‌కు ఫిదా అయిన తమన్నాకు అతనిపై ఉన్న అభిమానం ప్రేమగా మారింది. తదనంతరం ఇద్దరూ పబ్లిక్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో తమన్నా - విజయ్‌లు ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. తమ బంధాన్ని ఎక్కువ రోజులు దాయకూడదని నిర్ణయించుకున్న ఈ జంట ప్రేమ విషయాన్ని బయటపెట్టేశారు. ఇక అప్పటి నుంచి పబ్లిక్‌గానే ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలకు జంటగా హాజరయ్యేవారు. వెకేషన్స్, ట్రిప్స్‌కు వెళ్తూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకునేవారు.

Is Fatima Sana Shaikh dating with Tamannaah Bhatia s Ex Boyfriend Vijay Varma

మూడేళ్ల బంధానికి వీడ్కోలు
అంతా సాఫీగా సాగుతున్న దశలో వీరిద్దరూ విడివిడిగా కనిపించడంతో బాలీవుడ్ వర్గాలు, మీడియా అనుమానించాయి. చివరికి తమన్నా- విజయ్‌లు విడిపోయినట్లుగా తేలిపోయింది. పెళ్లి చేసుకుని త్వరగా లైఫ్‌లో స్థిరపడాలని తమన్నా తొందరపడగా.. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్ వర్మ పట్టుబట్టినట్లుగా గాసిప్స్ వచ్చాయి. ఇద్దరి నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉండిపోవడంతో ఇక తమకు సెట్ అవ్వదని, విడిపోవడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కథనాలు వెలువడ్డాయి. బ్రేకప్ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోగా .. తమన్నా వరుసపెట్టి సినిమాలు, ఐటెం సాంగ్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. విజయ్ వర్మ ప్రస్తుతం గుస్తాఖ్ ఇష్క్ అనే సినిమాలో నటిస్తున్నారు.

రిలేషన్‌పై తమన్నా సంచనల వ్యాఖ్యలు
బ్రేకప్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలని యువతకు తమన్నా పిలుపునిచ్చింది. ప్రేమలో నిజాయితీ ఉండాలని.. అది వ్యాపారంగా మారకూడదని పేర్కొంది. విజయ్ వర్మ అయితే రిలేషన్ అనేది ఐస్‌క్రీమ్ లాంటిదని వ్యాఖ్యానించారు. ఆనందం, బాధ, చిరాకు, కోపం ఇలా ఏ ఎమోషన్‌ను అయినా ఐస్‌క్రీమ్‌ మాదిరిగా పూర్తిగా చివరి వరకు ఆస్వాదించాలని విజయ్ అన్నారు.

Take a Poll

విజయ్‌ని ముద్దుల్లో ముంచెత్తిన నటి
ఇదిలాఉండగా తమన్నాతో విడిపోయిన తర్వాత విజయ్ వర్మ మరో హీరోయిన్‌తో ప్రేమలో పడినట్లుగా బాలీవుడ్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్. వీరిద్దరూ ఓ డేట్‌కు వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో విజయ్ వర్మని ఫాతిమా గట్టిగా హగ్ చేసుకోవడంతో పాటు అతని చెంపపై ఘాటుగా ముద్దు పెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని, తమన్నాతో బ్రేకప్‌ తర్వాత ఫాతిమాతో విజయ్ ప్రేమలో పడ్డారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడ్డారా? లేక ఏదైనా సినిమా కోసం కలిశారా? అన్నది మాత్రం తెలియరాలేదు. కానీ వీరి వ్యవహారం మాత్రం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X