ఆదేశాలు బేఖాతర్-సభ్యత్వానికి జెనీలియా ‘నో’?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్ని నోటీసులు జారీ చేసినా, ఎన్ని సార్లు హెచ్చరించినా 'మా"లో సభ్యత్వం తీసుకోవడానికి హీరోయిన్ జెనీలియా నో చెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం....ఇక తెలుగు సినిమా పరిశ్రమలో తనకు ఎలాంటి అవసరం లేదు, నేనెందుకు అనవసరంగా డబ్బులు తగలేసి సభ్యత్వం తీసుకోవాలనే భావనలో జెనీలియా ఉన్నట్లు సమాచారం. అందుకే 'మా" గతంలో నోటీసులు జారీ చేసినా, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసినా జెనీలియా పట్టించుకోవడం లేదని చర్చించుకుంటున్నారు.
జెనీలియా త్వరలో తన బాయ్ ఫ్రెండ్, మహా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన రిథేష్ దేశ్ ముఖ్ ను వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతోంది. దీనికి తోడు జెనీలియా ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేయడంపైనే ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు, ఇతర దక్షిణాది సినిమాల్లో అవకాశాలు మెండుగా వస్తున్నా...నిర్మొహమాటంగా తిరస్కరిస్తోంది. ఇదంతా గమనిస్తే....ఇక తెలుగు సినిమా పరిశ్రమతో, దక్షిణాది సినిమాలతో తనకు పని లేదని జెనీలియా డిసైడైందని, అందుకే 'మా" ఆదేశాలను పూచిక పుల్లలా తీసేస్తుందని సినీ వర్గాల్లో చర్చసాగుతోంది.
దీనికి తోడు 'మా" కార్యవర్గం.... నిషేదం, బహిష్కరణ లాంటి సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి ధైర్యం చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతుండటం కూడా జెనీలియాకు కలిసొస్తుంది. అయితే ఆత్కూర్ లేకుంటే ఘనాత్కూర్ అన్న చందంగా.....నిషేదం విధిస్తే సౌత్ సినిమాలకు రాం రాం చెబుదాం లేక పోతే వీలును బట్టి సినిమాలు చేసి నాలుగు డబ్బలు వెనసుకుందాం అనే ఆలోచనలో జెనీలియా ఉన్నట్లు...గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











