ఇండస్ట్రీ టాక్.. గ్లోబల్ స్టార్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? లైన్ లోకి మరో హీరో కం దర్శకుడు?
రానున్న రోజుల్లో తెలుగు స్టార్ హీరోస్ నుంచి పలు సెన్సేషనల్ సినిమాలే లైనప్ లో పెట్టుకున్నారు. కాగా ఇలా ఉన్న టాప్ హీరోస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. కాగా రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత అనౌన్స్ చేయడమే ఇండియన్ సినిమా దగ్గర మరో టాప్ దర్శకుడు శంకర్ తో అనౌన్స్ చేయడంతో ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకులు శంకర్ రాజమౌళితో చేసిన ఏకైక హీరోగా నిలిచాడు.
కానీ ఈ చిత్రం మాత్రం అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. పైగా రామ్ చరణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ తర్వాత అయినా చరణ్ నుంచి ఉన్న సినిమాలతో హ్యాపీ ఫీల్ అవుదాం అనుకుంటే వాటిలో ఇపుడు ఓ సినిమా ఆగిపోయినట్టుగా సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

శంకర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా అలాగే తన గురువు సుకుమార్ లతో వరుసగా సినిమాలు అనౌన్స్ చేసాడు. కాగా వీటిలో బుచ్చిబాబుతో సినిమా "పెద్ది" గా రివీల్ చేశారు. ఇక ఇదంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ కెరీర్ 17వ సినిమా పుష్ప 2 సంచలన హిట్ తర్వాత సుకుమార్ నుంచి చేయడం అనేది బిగ్ థింగ్ అయ్యింది. కాగా ఈ సినిమాని మేకర్స్ గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డేకే అనౌన్స్ చేశారు.
కానీ ఇపుడు ఈ ఏడాది పుట్టినరోజుకి మాత్రం కనీస విష్ కూడా చేయకపోవడం పలు ప్రశ్నలకి దారి తీసింది. ఇక మరో పక్క కొన్ని అంతర్గత వర్గాలు కూడా ప్రస్తుతానికి అయితే సుకుమార్ రామ్ చరణ్ ల సినిమా నిలిచిపోయినట్టు గానే తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజం అయితే రామ్ చరణ్ అభిమానులకే కాదు మెగా అభిమానులకి కూడా పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.
కానీ ఇపుడు ఇంకో క్రేజీ రూమర్ రామ్ చరణ్ లైనప్ లో వినిపిస్తుంది. కాగా వీటి ప్రకారం రామ్ చరణ్ ఒక టాప్ హీరో కం దర్శకునికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ హీరో కం దర్శకుడు ఎవరో కూడా కాదట తమిళ స్టార్ నటుడు గ్లోబల్ గా కూడా పలు సినిమాలు చేసిన కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్ తో అట. కాగా ధనుష్ రామ్ చరణ్ ఓ క్రేజీ స్క్రిప్ట్ చెప్పి ఒప్పించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో సుకుమార్ సినిమా ఆగిపోయినప్పటికీ ఈ సినిమా స్థానంలో ధనుష్ తో సినిమా రావచ్చని గట్టి బజ్ వినిపిస్తుంది. ధనుష్ రీసెంట్ గానే చరణ్ ని కలిసి నరేషన్ కూడా ఇచ్చాడని చరణ్ కి స్క్రిప్ట్ కూడా ఎంతో నచ్చింది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహించని కాంబినేషన్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. మరి ధనుష్ నుంచి రాయన్, రీసెంట్ గానే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











