మెగా అభిమానులకు బిగ్ ట్విస్ట్.. చిరంజీవి స్థానంలో రామ్ చరణ్?
ఈ ఏడాదిలో మెగా ఫ్యాన్స్ కి దక్కిన హై మూమెంట్స్ అయితే మరో ఇతర ఫ్యాన్స్ కి దక్కలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలో మెగా కుటుంబం నుంచి తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ దానికి మించిన హై ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి కుటుంబానికి అందించాడు. తా పొలిటికల్ సక్సెస్ ని తీసుకెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టిన సందర్భం అయితే మెగా ఫ్యాన్స్ కి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ కొట్టినా రానంత కిక్ ని ఇచ్చింది.
ఇలా ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు పెద్దగా రానప్పటికీ ఈ హై మూమెంట్స్ వారు ఎంజాయ్ చేశారు. సరే ఇది బాగానే ఉంది కానీ ఇక సినిమాల విషయానికి వస్తే.. ముగ్గురు టాప్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి అలాగే తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మెగా సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కూడా పలు భారీ చిత్రాలు అది కూడా స్ట్రైట్ సినిమాలు వస్తుండడంతో అంచనాలు పీక్స్ లోకి వెళ్లాయి.

కాగా ఈ ఏడాది చివరలో రామ్ చరణ్, శంకర్ ల "గేమ్ ఛేంజర్" ఉన్నప్పటికీ ఈ సినిమాకి మించి మెగా వీరాభిమానులు ఎదురు చూస్తున్న సినిమా మాత్రం చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ విజువల్ వండర్ చిత్రం "విశ్వంభర" ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చిరంజీవి ఒక సరైన హిట్ కొడితే దాని రుచి బాక్సాఫీస్ కి తెలుసు.
కాగా ఇప్పుడు చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక విజువల్ ట్రీట్ తో రాబోతున్నారు. దీనితో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో అయితే పాన్ ఇండియా సినిమాలకి జరిగే రేంజ్ బిజినెస్ జరుగుతుంది. మరి అలాంటి హైప్ ఉన్న "విశ్వంభర" పై పలు గాసిప్స్ ఇపుడు సినీ వర్గాల్లో ఊపందుకున్నాయి. ప్రస్తుతం చైతు చాలా రోజులు నుంచి చికెన్ గున్యాతో బాధ పడుతున్నారు.

దీనితో విశ్వంభర లో ఇంకా కొంచెం బ్యాలన్స్ ఉన్న షూట్ వాయిదా పడుతూ వస్తుందట. పైగా సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయట దీనితో సినిమా ఆలస్యం అవ్వొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియరాలేదు.
కాగా ఒకవేళ పరిస్థితి అనుకూలించని పక్షంలో విశ్వంభర జనవరి 10 డేట్ నుంచి తప్పుకుంటే ఆ ప్లేస్ లో బ్లాస్ట్ చేసేందుకు మెగా వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో వస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది ఒకవేళ విశ్వంభర మారితేనే అట లేని పక్షంలో డిసెంబర్ 20నే ఉంటుంది అని వినిపిస్తుంది. సో చూసుకున్నా కూడా సంక్రాంతి బరిలో మాత్రం మెగా హీరో ట్రీట్ వస్తుందని చెప్పొచ్చు.. మరి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు కాటేరమ్మ లాంటి మెగాస్టారే వస్తారో లేక బదులుగా తన కొడుకుని పంపిస్తారో కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











