Fact Check : రామ్ చరణ్‌తో సందీప్ వంగా మూవీ? అల్లు అర్జున్ ఆ ప్రాజెక్టును వదులుకున్నాడా?

ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి సెన్సేషనల్ హీరోస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. కాగా రామ్ చరణ్ ఇపుడు చేస్తున్న సినిమాలు తక్కువే ఉన్నాయి. ఈ విషయంలో ఇతర హీరోస్ తో పోలిస్తే తాను కొంచెం వెనకే ఉన్నాడు కానీ ఈ సినిమాల లిస్ట్ లో కొన్ని సినిమాలు అనుకున్నవి ముందు ఆగిపోయినవి ఉన్నాయి అలాగే కొత్త కొత్త యాడ్ ఆన్ లు కూడా వస్తున్నట్టుగా పలు పుకార్లు వినిపిస్తున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న సినిమానే పెద్ది. రామ్ చరణ్ కెరీర్లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రం రంగస్థలం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇపుడు పెద్ది కూడా ఇదే తరహాలో కనిపిస్తుండడంతో ఆల్రెడీ దీనిపై భారీ హైప్ నెలకొంది. కాగా ఈ సినిమా కాకుండా మళ్ళీ రంగస్థలం దర్శకుడు సుకుమార్ తోనే రామ్ చరణ్ కెరీర్ 17వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలిసిందే.

Is global star ram charan gets Sandeep Reddy Vanga Project which Allu Arjun left

మరి ఇటీవల చరణ్ పుట్టినరోజుకి ఈ చిత్రం నుంచి ఎలాంటి విష్ రావడం జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయింది. లేదా తాత్కాలికంగా వాయిదా పడింది అంటూ పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇపుడు అసలు ట్విస్ట్ దీనిపై వినిపిస్తుంది. కాగా ఈ చిత్రంపై వినిపిస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదట. అయితే ఈ సినిమా ఆగిపోలేదు అని తెలుస్తుంది.

ఈ ఏడాది లోనే షూటింగ్ ఉంటుందట. కాగా ఇవి పక్కన పెడితే మరో భారీ చిత్రం ఇపుడు చరణ్ లైన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్నాళ్ల నుంచి సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో సినిమా ఉంటుంది అని టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇది వరకే అనౌన్స్ అయ్యిన ఓ భారీ కాంబినేషన్ లో సినిమా ఆ హీరోని కాదని ఇపుడు రామ్ చరణ్ చెంతకి వచ్చినట్టుగా గట్టి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి ఈ సినిమా కూడా ఏదో కాదు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా అందరికీ తెలిసిందే. కాగా ఈ కాంబినేషన్ లోనే బిగ్ ఛేంజ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమానే అల్లు అర్జున్ నుంచి రామ్ చరణ్ దగ్గరకి వెళ్లిందట. అల్లు అర్జున్ అంటే సందీప్ రెడ్డి వంగకి చాలా ఇష్టం అని చెప్పిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి.

అయినప్పటికీ వీరి కలయికలో సినిమా మరో హీరో దగ్గరకి వెళ్ళింది అంటే కొంచెం నమ్మశక్యంగా లేదు కానీ ఇపుడు మాత్రం ఈ బిగ్ ప్రాజెక్ట్ పట్ల మంచి సస్పెన్స్ ఇపుడు నెలకొంది. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా కంప్లీట్ చేయనుండగా ఈ సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ తో ఉంటుంది. అలాగే సందీప్ కూడా ప్రభాస్ తో స్పిరిట్ ని స్టార్ట్ చేస్తుండగా ఈ సినిమా తర్వాత అనిమల్ పార్క్ ఉంటుందా లేక రామ్ చరణ్ తోనా లేక అల్లు అర్జున్ తో ఉంటుందా అనేది వేచి చూడక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X