Ram Charan: కిల్ దర్శకుడితో రాంచరణ్.. క్రేజీ ప్రాజెక్టుపై డైరెక్టర్ క్లారిటీ
ఇప్పుడు ఇండియా వైడ్ గా పలువురు స్టార్ హీరోలు అలాగే దర్శకులు విషయం ఎలాంటి కాంబినేషన్ లు సెట్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఇలా సెట్ అయిన కొన్ని కాంబినేషన్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్నాయి. అలాంటి ఒక కాంబినేషన్ ఒకటి ఉంది. రీసెంట్ గా ఒక సెన్సేషనల్ రూమర్స్ నేషనల్ మీడియా వరకు కూడా వైరల్ అయ్యాయి.
అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు నిఖిల్ నగేష్ బట్ కలయికలో ఒక బిగ్ బడ్జెట్ ఫాంటసీ డ్రామా అని ప్లాన్ చేస్తున్నారంటూ పలు రూమర్స్ బయటకు వచ్చాయి. కాగా వీరి కలయికలో సినిమా మన పురాణాల నేపథ్యంలో ఉంటుంది అని కూడా వినిపించింది. అయితే ఈ దర్శకుడు నుంచి దీనికి ముందు వచ్చిన సెన్సేషనల్ సినిమా అది కూడా ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరో కానీ దర్శకుడు కానీ చూపించని మోస్ట్ వైలెంట్ సినిమాగా "కిల్" అనే సినిమా తీయడంతో ఈ ఊహించని కలయిక పట్ల బజ్ ఊహించని లెవెల్లోకి మారిపోయింది.

కాగా అక్కడ నుంచి తెలుగు సినిమ వర్గాల్లోనే కాకుండా హిందీ సినీ వర్గాల్లో కూడా వీరి కాంబినేషన్ విషయంలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయాయి. కాగా ఇపుడు ఈ కాంబినేషన్ పై స్వయంగా దర్శకుడే కుండ బద్దలు కొట్టినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిఖిల్ నగేష్ బట్ ని బాలీవుడ్ మీడియా వారు సంప్రదించగా రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాను అనే మాటల్లో కొంచెం కూడా నిజం లేదని తేల్చేసేసారు.
దీనితో ఓ రేంజ్ లో హైప్ కి వెళ్లిపోయిన ఈ కాంబినేషన్ అంతే వేగంగా కూలిపోవాల్సి వచ్చింది అని చెప్పాలి. మెగా అభిమానులు ఆల్రెడీ గేమ్ ఛేంజర్ అనే బిగ్ డిజాస్టర్ తో డీలా పడి ఉన్నారు. కాగా ఇలాంటి షాక్ ల నుంచి తేరుకోవాలి అంటే అలాంటి కాంబినేషన్ లు తప్పనిసరి. కానీ ఇపుడు అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

మరి చూడాలి గ్లోబల్ స్టార్ ని ఏ హిందీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడు అనేది. ఇక ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఓ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
అలాగే ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ తదితర అగ్ర తారాగణం కీలక పాత్రలు చేస్తుండగా దిగ్గజ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ అనే కొత్త బ్యానర్ లో సినిమా నిర్మాణం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ కూడా భారీ బడ్జెట్ ని ఈ సినిమా కోసం పెడుతున్నారట.


Click it and Unblock the Notifications











