Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దర్శకుడు హర్ట్ అవటంతో గోపీచంద్ సినిమా స్టాప్?
గోపీచంద్,తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందని,దర్శకుడు చేతులెత్తేసాడని తమిళ మీడియా నుంచి వార్తలు వినపడుతున్నాయి. అక్కడ వినపడే వార్తలు ప్రకారం గోపీచంద్ ఈ సబ్జెక్ట్ లో తన దైన శైలిలో మార్పులు చెప్పటం వల్ల దర్శకుడు హర్ట్ అయ్యాడని చెప్తున్నారు. అందులోనూ దీని రచయిత ఎం రత్నం సహకారంతో గోపీచంద్ తానే కొన్ని సీన్స్ డైరక్ట్ చేయబోయాడని కూడా రూమర్స్ వినపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే మరో దర్శకుడు కోసం వెయిటింగ్ అని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి జగన్ మోహన్ ఐపియస్ అనే టైటిల్ ని నిర్ణయించారు. మొగుడు సినిమాతో భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న గోపీ చంద్ తాజాగా ఈ కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు. జై బాలాజీ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని భూపతి పాండ్యన్ దర్శకత్వంలో తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా, గోపీచంద్‌కు సూట్ అయ్యే కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇందులో గోపీ చంద్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని ఆయన తెలిపారు. త్వరలోనే హీరోయిన్ ఎంపిక జరుగుతుందన్నారు.
గతంలో గోపీచంద్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'గోలీమార్' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే గోపీచంద్ పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను అలరించ లేక పోయింది. చాలా రోజులగా సరైన హిట్టులేని ఈ హీరో మరోసారి పోలీసాఫీసర్ పాత్రను నమ్ముకున్నాడు. మరి ఈ సారి ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి. కోట శ్రీనివాసరావు, రఘుబాబు, షాయాజీషిండే, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, కెమెరా: శక్తి శరవణన్, సమర్పణ: కొమర వెంక కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం: భూపతి పాండ్యన్.
మరోప్రక్క గోపీచంద్ గతంలో తనను ఒక్కడున్నాడు గా చూపించిన యోలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. నిధి వేట ప్రదానాంసంగా అడ్వెంచరస్ మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తాప్సీ నటిస్తోంది. గీపంచంద్ ఈ చిత్రంపై చాలా ఆసలు పెట్టుకున్నారు. వెరీటీ గా రూపొందే ఈ చిత్రం తన కెరీర్ లో మరో పెద్ద హిట్టవుతుందని భావిస్తున్నాడు.
gopichand, bhupathi pandian, mogudu, గోపీచంద్, భూపతి పాండ్యన్, మొగుడు