Divorce: విడాకుల దిశగా హన్సిక మోత్వాని? స్టార్ హీరోయిన్ బ్రేకప్‌పై షాకింగ్ అనుమానాలు!
ఫిల్మ్ సొసైటీలో మారిన పరిస్థితుల కారణంగా దాంపత్య జీవితాల వైఫల్యాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. సంసార జీవితంలో రాజీ పడలేని వారు నేరుగా విడాకులు తీసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారనేది ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తే అర్ధమవుతుంది. ఇక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న తారల జీవితాలపై ఎక్కువగా ఆసక్తి ఉండటంతో వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన గాసిప్ వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీలో కూడా విడాకుల వార్తలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆమె చేసిన పనితో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. హన్సిక వ్యక్తిగత జీవితం గురించిన వివరాల్లోకి వెళితే..
అందాల తారగా హన్సిక మోత్వానీ దక్షిణాది సినిమా పరిశ్రమలో అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. అప్పట్లో తమిళ, తెలుగు సినీ రంగాల్లోని టాప్ హీరోలతో కలిసి జతకట్టారు. ఆ సమయంలో పలువురు హీరోలతో ఆమెకు అఫైర్ వార్తలు వచ్చాయి. దాంతోపాటు వెంటనే బ్రేకప్ వార్తలు కూడా హైలెట్ అయ్యాయి. తమిళ భాషలోని యువ హీరోలతో ఆమె రిలేషన్‌షిప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఏనాడు కూడా హీరోలతో ఆమె తన బంధాలపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు.

కానీ హీరో శింబుతో హాన్సిక మోత్వాని రిలేషన్ మాత్రం స్పెషల్‌గానే మీడియాలో ఉండిపోయింది. వారిద్దరి డేటింగ్ వ్యవహారం గురించి మీడియా కథకథలుగా చెప్పుకొన్నారు. అయితే వారిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. కానీ చివరి నిమిషంలో వారిద్దరి బ్రేకప్ జరిగింది. అలా విడిపోవడానికి కారణాలేమిటో బయటకు రాకపోవడంతో అది మిస్టరీగానే మిగిలిపోయింది అని తమిళ సినీ మీడియా వర్గాలు పేర్కొంటాయి.
అయితే శింబుతో అఫైర్, రిలేషన్‌షిప్ తర్వాత హన్సిక తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో డేటింగ్ చేశారు. అలా కొంతకాలం అఫైర్ కొనసాగించిన తర్వాత వారిద్దరూ జీవితంలో ముందుకు కలిసి నడవాలని నిర్ణయించుకొన్నారు. చివరకు జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలెస్‌లో డిసెంబర్ 4వ తేదీ, 2022 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ కలిసి మెలిసి దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
అయితే తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి హాన్సిక మోత్వానీ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో అనేక సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. ఇటీవల కాలంలో మ్యారేజ్ బ్రేకప్ నేపథ్యంలో సెలబ్రిటీలందరూ తమ వెడ్డింగ్ షూట్ ఫోటోలను తమ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగిస్తూ తమ అభిమానులకు, మీడియాకు హింట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ఇలాంటి చర్యకు పాల్పడిందా? అనే అనుమానం మీడియాలోను, సోషల్ మీడియాలోను కలిగింది. అయితే ఈ విషయంపై హన్సిక క్లారిటీ ఇస్తే తప్పా ఆమె దాంపత్య జీవితంపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడే అవకాశం ఉంది.

హన్సిక మోత్వానీ కెరీర్ విషయానికి వస్తే... హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా సినిమాలో బాలనటిగా నటించడం ద్వారా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో కంత్రీ, బిల్లా, మస్కా, జయీభవ, పవర్, అరణ్మయి, పోకిరి రాజా తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన సినిమాలు మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్. ప్రస్తుతం రౌడీ బేబీ, మ్యాన్, గంధారీ, లవ్ అఫైర్ సినిమాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











