హనుమాన్ 2 నుంచి తప్పుకున్న ప్రైమ్ షో బ్యానర్.. జై హనుమాన్ కోసం టాప్ ప్రొడ్యూసర్స్.. కారణం అదే అంటూ రూమర్
సినిమాకి ఎలాంటి హద్దులు లేవు.. సినిమాని ఎంత కొత్త ఎంత ఇంట్రస్టింగ్ గా చూపిస్తే ఆటోమేటిక్ గా థియేటర్స్ కి జనాలు క్యూలు కడతారు. మరి ఇలా మారుతున్న కాలంలో చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ లు జానర్ లు మూవీ లవర్స్ కి పరిచయం అవుతూ వస్తున్నాయి. అలా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యిన జానర్స్ లో సూపర్ హీరోలు ఇంకా సినిమాటిక్ యూనివర్స్ లు జానర్స్ కూడా ఒకటి.
కాగా ఈ ట్రెండ్ హాలీవుడ్ లో ఎప్పుడో ఉన్నపటికీ మన దగ్గర కూడా ఇప్పుడు బాగా ఊపందుకుంది. దాదాపు ఇండియన్ సినిమా దగ్గర అన్ని సినీ ఇండస్ట్రీస్ లో కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ రెడీ అయ్యింది. ఇలా మన తెలుగు సినిమాలో రెండు సినిమాటిక్ యూనివర్స్ లు ఉండగా వాటిలో టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పరిచయం చేసిన సూపర్ హీరో జానర్ కం సినిమాటిక్ యూనివర్స్ కూడా ఒకటి.

అలా యువ హీరో తేజ సజ్జతో చేసిన భారీ హిట్ చిత్రం "హను మాన్" చిన్న సినిమాల్లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టి దుమ్ము లేపింది. దీనితో ఈ సినిమాతో పరిచయం అయ్యిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు పెట్టిన దానికి ప్రాఫిట్స్ ని అందుకున్నారు. ఇలా హను మాన్ తో భారీ లాభాలు గడించిన నిర్మాతలు తర్వాత ఆ లాభాలని పోగొట్టుకోడానికి ఎక్కువ సమయం తీసుకోలేదని చెప్పాలి.
అందుకే ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్న హను మాన్ పార్ట్ 2 "జై హనుమాన్" కి నిర్మాతలుగా తప్పుకుంటున్నట్టు సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా హక్కులు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 కోట్ల మేర పెట్టి కొనేశారు. కానీ ఈ చిత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యింది. దీనితో ఈ సినిమా సగం వసూళ్లు కూడా వెనక్కి రాబట్టకపోవడంతో భారీ నష్టాలు వారు చూడాల్సి వచ్చింది.

దీనితో అక్కడ మొదటి సినిమాకి వచ్చిన లాభాలు ఈ సినిమాకి పోగొట్టుకున్నారు. దీని ఎఫెక్ట్ ఇపుడు జై హనుమాన్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ డబ్బులు పోగొట్టుకోవడం, పైగా జై హనుమాన్ బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో ఆ మాసివ్ సీక్వెల్ నుంచి తప్పుకున్నారట. కాగా మరి జై హనుమాన్ ఆగిపోయినట్టేనా అంటే.. లేదనే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ లో అటు నిర్మాణ పరంగా ఇటు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మోస్ట్ సక్సెస్ లు చూసిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు టేకోవర్ చేయనున్నారని తెలుస్తుంది. జై హనుమాన్ కి ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారట. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ కూడా త్వరలో రానున్నట్టు కొన్ని పుకార్లు ఇపుడు టాలీవుడ్ వర్గాల్లో ఊపందుకున్నాయి. సో ఈ సెన్సేషనల్ సీక్వెల్ ని ఎవరు చేస్తారో వేచి చూడాల్సిందే మరి.


Click it and Unblock the Notifications











