అనన్య పాండేతో స్టార్ క్రికెటర్ డేటింగ్.. ప్రేమ మత్తులో 3 కోట్ల కారు గిఫ్ట్
మన దేశంలో అతి పెద్ద ఎంటర్టైనింగ్ రంగాల్లో సినిమా అలాగే క్రికెట్ లు మొదటి రెండు స్థానాలు తీసుకుంటాయని చెప్పొచ్చు. అలాగే ఈ రెండు రంగాలు కూడా దాదాపు వేరే విధంగా ఇంటర్ లింక్ అయ్యి ఉంటాయి. అంటే కొందరు క్రికెటర్ లు సినీ రంగానికి చెందిన వారిలో ఫ్రెండ్స్ ఉండడమో లేదా పెళ్లి చేసుకోవడమో ఇలా చాలా రకాలుగా క్రికెటర్స్ కి సినిమా వాళ్ళకి గట్టో సంబంధాలే ఉంటాయి.
ఇవే కాకుండా దాదాపు రెండు పరిశ్రమలకి సంబంధించి పలువురు పర్శనల్ జీవితాలు కూడా ఒకేలా ఉంటాయని చెప్పవచ్చు. కాగా కొందరు స్టార్స్ తమ లైఫ్ పార్ట్నర్స్ తో మధ్యలోనే విడిపోవడం ఒకరితో ఇంకొకరు డేటింగ్ లో కనిపించడం వంటివి కూడా కనిపిస్తాయి. అలా తాజాగా ఓ స్టార్ హీరోయిన్ జస్ట్ రీసెంట్ గానే తన భార్యతో విడిపోయిన స్టార్ ఇండియన్ క్రికెటర్ ఒకరు డేటింగ్ లో ఉన్నట్టుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి.

మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే అట. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన ఈ యంగ్ బ్యూటీ మన తెలుగులో యువ హీరో విజయ్ దేవరకొండతో "లైగర్" అనే డిజాస్టర్ చేసింది. ఇలా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. కాగా ఇపుడు ఈమెతోనే ప్రముఖ క్రికెటర్ పాండ్యా డేటింగ్ లో ఉన్నాడు అంటూ క్రేజీ రూమర్స్ బాలీవుడ్ లో గుప్పుమన్నాయి.
ఇంతేనా వీరి మేటర్ చాలా దూరం వెళ్తుంది అని అంటున్నారు. ఇద్దరు మీద ఇలా రూమర్స్ మొదలవుతున్నాయో లేదో అనన్య ఇంట ఏకంగా 3 కోట్ల ఖరీదైన రేంజరోవర్ కారు కనిపించింది. మరి ఇది ఆమెనే కొనుకుందా లేదా అనేది ఏమో కానీ ప్రస్తుతానికి అయితే తమ డేటింగ్ లో భాగంగా పాండ్యా ఆ కారు బహుమతిగా ఇచ్చాడు అని గాసిప్స్ సర్క్యులేట్ అవుతున్నాయి.

దీనితో వీరిద్దరి నడుమ ఏదో నడుస్తున్నట్టే అని అంతా అంటున్నారు. మరి వీరు త్వరలోనే ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కాగా ఇప్పుడు పాండ్య తన భార్యకి విడాకులు ఇవ్వగా ఆమె తన సొంత దేశానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ తన క్రికెట్ లో పాండ్య బిజీగా ఉన్నాడు.
ఇక పోతే అనన్య పాండే రీసెంట్ గానే బాలీవుడ్ బోల్డ్ ఎంటర్టైనర్ నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రి, టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ లు నటించిన బ్యాడ్ న్యూజ్ లో స్పెషల్ క్యామియోలో కనిపించగా ఈ సినిమా తర్వాత కంట్రోల్, శంకర అనే మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో ఆమె నటిస్తుంది. ఇక విజయ్ దేవాకొండ, పూరి జగన్నాథ్ లు ఇచ్చిన లైగర్ షాక్ తో అయితే మళ్ళీ టాలీవుడ్ వైపు కూడా అనన్య పాండే చూడలేదు. ప్రస్తుతానికి ఐతే అనన్య పాండే ఇలా వార్తల్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











