యువ హీరోయిన్‌తో నితిన్ అఫైర్.. పెళ్లి అంటూ న్యూస్ హల్‌చల్
హీరో నితిన్ రెడ్డితో ఓ యువ హీరోయిన్‌కు లింకు పెడుతూ మీడియాలో సర్కులేట్ అవుతున్న నిరాధారమైన వార్త ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
Recommended Video

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య అఫైర్స్ అనేది చాలా సర్వసాధారణం. అయితే కొన్ని వెలుగులోకి వస్తాయి. కొన్ని చాటుమాటుగా జరుగుతుంటాయి. జనరల్‌గా ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండే హీరో నితిన్ రెడ్డితో ఓ యువ హీరోయిన్‌కు లింకు పెడుతూ మీడియాలో సర్కులేట్ అవుతున్న నిరాధారమైన వార్త ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న యువ హీరోలలో ఒకరైన నితిన్‌పై ఇలాంటి వార్త వెలుగు చూడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ వార్త సారాంశం ఏమిటంటే..

లై చిత్రంలో మేఘా ఆకాశ్‌తో
నితిన్ లేటెస్ట్ సినిమా ‘లై'. చిత్రంలో నితిన్ సరసన మేఘా ఆకాశ్ నటించింది. ఈ చిత్ర షూటింగ్‌లో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందట. ఆ తర్వాత నుంచి వారిద్దరూ పీకల్లోతూ ప్రేమలో పడినట్టు వెబ్ మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

పెళ్లి ఆలోచనలో యువ జంట
నితిన్, మేఘా ఆకాశ్ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కథనంలో పేర్కొన్నారు. పెళ్లికి నితిన్ కుటుంబ సభ్యులు కూడా సానుకూలంగా ఉన్నట్టు వార్తా సారాంశం. . అయితే ఈ వార్తపై అటు నితిన్ గానీ, మేఘా ఆకాశ్ గానీ స్పందించకోవడంతో నిజమేనా అనే అనుమానం మొలకెత్తుతున్నది.

సినిమాలను రిజెక్ట్
నితిన్‌తో అఫైర్ కారణంగానే మేఘా ఆకాశ్ తెలుగులో అవకాశాలను తిరస్కరిస్తున్నదనే ప్రచారం కూడా జరుగుతున్నది. తాజాగా రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం నుంచి తప్పుకోవడం కూడా ఇదే కారణం అని తెలుస్తున్నది.

నితిన్‌తోనే మరో సినిమా
అయితే ప్రస్తుతం తెలుగులో నితిన్‌తో సినిమా చేస్తున్నది. లై చిత్రం తర్వాత చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ మేఘా వాటిని సున్నితంగా తిరస్కరించినట్టు ఫిలింనగర్ సమాచారం.

తమిళంలో రెండు చిత్రాలు
ఇక తమిళంలో మేఘా ఆకాశ్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. ఎనాయ్ నోకి పాయమ్ తోట, ఓరు పక్క కథై అనే చిత్రాల్లో నటిస్తున్నది. ఈ చిత్రాలు గతంలో అంగీకరించినవే కావడం గమనార్హం.

నిజమా? అబద్దమా?
ఇదిలా ఉంటే, నితిన్, మేఘా ఆకాశ్ మధ్య సినిమా పరమైన రిలేషననేనా? లేదా గాసిప్స్‌కు బలం ఇచ్చే బంధమేమైనా కొనసాగుతుందా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ వార్తలో నిజమెంత ఉందనే విషయం తెలుసుకోవాలంటే వారి నుంచి ఓ క్లారిటీ రావాల్సిందే.


Click it and Unblock the Notifications











