రంభ విడాకులు తీసుకోబోతున్నదా? భర్తతో విభేదాలపై సీనియర్ హీరోయిన్ చెప్పిందేమిటి?
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రంభ టాలెంట్, గ్లామర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సినీ జీవితాన్ని ప్రారంభించి.. హిందీలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకొన్న విషయం తెలిసిందే. కెరీర్ టాప్ రేంజ్‌లో కొనసాగుతుండగానే ఆమె వివాహం చేసుకొని గృహిణిగా సెటిల్ అయిపోయింది. అయితే అప్పుడప్పుడు ఆమె భర్తతో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంటాయి. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రంభ వ్యక్తిగత జీవితం, డైవోర్స్ గురించిన రూమర్ల వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున నుంచి రాజేంద్ర ప్రసాద్ వరకు సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా నటించింది. అటు హిందీలోను, తమిళంలోను టాప్ హీరోలతో కలిసి నటించింది. అప్పట్లో ఆమె అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్నది. ఆమె డేట్స్ కోసం నిర్మాత, దర్శకులు వేచి చూసేలా కెరీర్ కొనసాగింది.

అయితే కెరీర్ మంచి జోష్‌లో ఉండగానే.. కెనడాకు చెందిన బిజినెస్‌మ్యాన్ ఇంద్రకుమార్ పద్మనాధన్‌ను వివాహం చేసుకొని కెనడాలో సెటిల్ అయింది. భర్త జన్మత శ్రీలంకకు చెందిన వారనే విషయం తెలిసిందే. 2010 నుంచి రంభ వైవాహిక జీవితం సవ్యంగా సాగుతున్నది. ఆమెకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. అలా ఫ్యామిలీ లైఫ్‌ను సవ్యంగా కొనసాగిస్తున్నది.
రంభ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫ్యామిలీ, పిల్లల గురించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. వెకేషన్స్, సంప్రదాయంగా నిర్వహించే పూజలు, పునస్కారాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. దాంతో ఆమె అభిమానులు వాటిని వైరల్ చేస్తుంటారు. ఎక్కడ భర్తతో విభేదాలు ఉన్నట్టు కనిపించవు.

కానీ అప్పట్లో రాఘవేంద్రరావు నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న రంభ.. తన మ్యారేజ్, తన భర్తతో విభేదాలు, డైవోర్స్ రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు. తన భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకొంటున్నట్టు వస్తున్న వార్తలను చూసి షాక్ అయ్యాను. ప్రతీ ఇంటిలో ఆలుమగల మధ్య విభేదాలు ఉండటం సహజం. అలాండి ఢిఫరెన్సెస్ మా మధ్య ఉన్నాయని వెల్లడించింది. దాంతో విడాకులు వార్తలకు చెక్ పెట్టారు.
రంభ కెరీర్ విషయానికి వస్తే. 1991 నుంచి 2011 వరకు తన కెరీర్‌ను రాకెట్‌లో దూసుకెళ్లేలా నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాళీ, భోజ్‌పూరి భాషల్లో సుమారుగా 100 చిత్రాలకుపైగా నటించింది. అలాంటి టాలెంటెడ్ నటి త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు కూడా మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











