హాలీవుడ్ చిత్రం నుంచే Hit 3నా.. ముఖ్యంగా ఆ పాత్రపై చర్చ
నేచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలో మంచి ఫలితాలను అందుకుంది. చివరిగా 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రెండు సినిమాలు కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండానే.. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను అందుకున్నారు. ఇక తాజాగా హిట్ 3 సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమా గురించి ఒక కొత్త చర్చ మొదలవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Hit Verse చిత్రాలు..
క్రైమ్ థ్రిల్లర్ ఫిల్స్మ్ 'హిట్ వెర్స్'ను దర్శకుడు శైలేష్ కొలను క్రియేట్ చేశారు. ఇతని ఫస్ట్ చిత్రం 'హిట్ : ది ఫస్ట్ కేసు'. 2020 ఫిబ్రవరి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అడివి శేష్ 'హిట్ : ది సెకండ్ కేస్' కూడా వచ్చింది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ తో సాగే ఈ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగాయి. దీంతో సిరీస్ లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హిట్ 3ని కూడా గ్రాండ్ గా విడుదల చేశారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు.

Hit 3 చిత్రం నటీనటులు, టెక్నీషియన్లు
హిట్ : ది థర్డ్ కేసు చిత్రం మే1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేచురల్ స్టార్ నాని - శ్రీనిధి శెట్టి జోడీగా నటించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లలో గ్రాండ్ గా నిర్మించారు. సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు చూశారకు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
హిట్ 3 సినిమా ఇక్కడి నుంచే పుట్టిందా?
హిట్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేయడం చాలా కష్టం. క్రైమ్, థ్రిల్లర్ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాయో వాటిని డిజైన్ చేసే వారికి అంత శ్రమ ఉంటుంది. అయితే ఆ విషయంలో శైలేష్ కొలను సక్సెస్ అయ్యాడని సినీ ప్రముఖులు చెబుతూ వస్తున్నారు. కాగా, మే1న సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి జరుగుతోంది. ఈ చిత్రంలోని నాని, జోజు జార్జిలు ప్రదర్శించిన నెగెటివ్ షేడ్ క్యారెక్టర్స్ ను డైరెక్టర్ శైలేష్ కొలను హాలీవుడ్ చిత్రం హాస్టల్ 3 నుంచి స్ఫూర్తి పొందారని అంటున్నారు. ఆ చిత్రంలో లానే నాని హిట్ 3లో చివరి 30 నిమిషాలు ఊచకోత ఉంటుందని అంటున్నారు. అయితే ఆ చిత్రంలో ప్రజంటేషన్ బాగుంటుందని, కాస్తా శైలేష్ కొలను అది మిస్ అయ్యారని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
హిట్ 3 సినిమా బ్జడ్జెట్, డే1 కలెక్షన్లు
హిట్ : ది థర్డ్ కేస్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. అయితే చిత్రాన్ని రూ.65 కోట్ల మేర బడ్జెట్ ను వెచ్చించారు. ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహించడంతో ఇండియా + ఓవర్సీస్ లో గట్టిగా వసూళ్లు రాబడుతోంది. ఓపెనింగ్ డే మాత్రం ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. మున్ముందు ఇంకెలా వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











