Ram Charan VS Allu Arjun: రాంచరణ్‌తో అల్లు అర్జున్ డైరెక్ట్ ఫైట్..ఫ్యాన్స్‌లో మెగా చిచ్చు ఖాయమేనా?

ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా హల్‌చల్ చేస్తున్న స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా ఒక కారణమైతే.. వైసీపీ నేతకు మద్దతిచ్చి అభాసుపాలు కావడమేకాకుండా మెగా ఫ్యామిలీలో విభేదాలకు మరో కారణం అయ్యారు. అయితే వైసీపీ పార్టీ నేతకు మద్దతు ఇవ్వడంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో అమీతుమీ చతెల్చుకొనేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆ వార్త వివరాల్లోకి వెలితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో సిద్దంగా ఉన్నారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మెగా ఫ్యామిలీతో పంచాయితీ కారణంగా ఆ సినిమా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గారనే విషయం బయటకు వచ్చింది.

Is Icon Star Allu Arjun s Pushpa 2 going to clash with Ram Charan s Game Changer on December 20th

పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ నిర్ణయం తీసుకోవడంతో పుష్ప 2 వస్తే ఆ సినిమాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వకూడదని మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారట. ఆ కారణంగానే పుష్ప 2 సినిమాను రిలీజ్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. ఆగస్టు 15 కాకుండా మరో డేట్‌ను ఫైనలైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ వాయిదా పడితే.. సరైన డేట్ ఇప్పట్లో దొరకడం కష్టమే. దసరా, దీపావళీ పండుగలకు ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అయితే ఇక చాయిస్ ఉన్నది ఇయర్ ఎండ్‌లోనే. దాంతో ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Is Icon Star Allu Arjun s Pushpa 2 going to clash with Ram Charan s Game Changer on December 20th

ఇక క్రిస్మస్ పండుగకు లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేసుకొని అదే డిసెంబర్ 20వ తేదీకి రాంచరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. దాంతో పుష్ప 2, గేమ్ ఛేంజర్ రెండు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయా? అనే అనుమానాలు తలెత్తాయి.

ఒకవేళ ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు కొనసాగుతున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్, పుష్ప 2 ఒకే డేట్‌కు రిలీజ్ అయితే ఫ్యాన్స్ మధ్య రచ్చ మాములుగా ఉండదనే విషయాన్ని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇంటి వరకే పరిమితమైన వివాదం.. ఫ్యాన్స్ మధ్య కూడా చిచ్చు రేపే అవకాశం ఉందంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X