బాలీవుడ్ లో అసిన్ ప్లేస్ కొట్టేస్తున్న జూ ఎన్టీఆర్ హీరోయిన్
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'శక్తి" చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న గోవా బ్యూటీ ఇలియానా అతి త్వరలో బాలీవుడ్ లో నటించనుంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఇలియానా 'పోకిరి" సినిమాతో తన స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకొన్నది. బాలీవుడ్ లో దర్శకుడు అనురాగ్ బసు, రణ్ బీర్ కపూర్ హీరోగా రూపొందించబోతున్న చిత్రం 'బర్సీ". అనురాగ్ బసు మొదటి సైలెన్స్ అనే టైటిల్ ను సెలక్ట్ చేశారు అయితె రణ్ బీర్ కపూర్ చార్లీన్ చాంప్లిన్ క్యారెక్టర్ పోలివుండటంతో తర్వాత బర్సీ అనే టైటిల్ ను ఎంపిక చేయడం జరిగింది.
ఈ చిత్రం కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్స్ ఈ చిత్రంలో నటిస్తారు. అయితే ఇప్పటికే మొదటి హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, అసిన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పూర్తి స్థాయి హాస్య కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో ఇలియానా రెండో హీరోయిన్ గా నటించడానికి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ప్రస్తుతం ఇలియానా, పూరి దర్శకత్వంలో రాణా రెండవ చిత్రమైన 'నేను నా రాక్షసి" చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నది.


Click it and Unblock the Notifications











