మాటల మాంత్రికుడిని ఇలియానా కలిసిందా.. మళ్లీ మ్యాజిక్ ఏమైనా!
నడుము సుందరి ఇలియానా ప్రస్తుతం టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. ఆరేళ్ళ తరువాత ఈ భామ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో ఇలియానా నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 16న విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రచార కార్యక్రమాల కోసం ఇలియానా ఇటీవల హైదరాబాద్ వచ్చింది. పలు ఇంటర్వ్యూలతో బిజీగా గడిపిన ఇలియానా ఇండస్ట్రీలోని పాత మిత్రులని కలసినట్లు వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్‌ని కలసి
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇలియానా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన జల్సా, జులాయి చిత్రాల్లో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా ఇలియానా, త్రివిక్రమ్ ని కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

అవకాశాల కోసం
ఇలియానాకు బాలీవుడ్ లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీనితో అమర్ అక్బర్ ఆంటోనిలో నటించే అవకాశం వచ్చింది. ఇప్పటి నుంచి అయినా తెలుగులో తిరిగి పుంజుకోవాలని ఇలియానా భావిస్తోంది. దీనితో తనకు రెండు సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సూచనలు తీసుకుందామని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

తక్కువ టైంలోనే
స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కెరీర్ ఆరంభంలోనే ఇలియానాకు అదృష్టం కలసి వచ్చింది. ఇలియానా నటించిన తొలి చిత్రం దేవదాసు కాగా రెండవ చిత్రం పోకిరితో సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్ లో పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరితో నటించింది.

శ్రీనువైట్ల దర్శత్వంలో
అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో ఇలియానా నాల్గవసారి రవితేజతో జతకడుతోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ, ఇలియానా, శ్రీనువైట్ల ముగ్గురికి అమర్ అక్బర్ ఆంటోని చిత్రం విజయం సాధించడం అవసరం.


Click it and Unblock the Notifications











