భార్యకు ఇండియన్ క్రికెటర్ విడాకులు? టాలీవుడ్‌లో మత్తెక్కించే హాట్ షోనే కారణమా?
మన దేశంలో జనం అత్యధికంగా ఆదరించే రెండు స్ట్రాంగ్ ఎమోషన్స్ ఏవి అంటే వాటిలో సినిమా, క్రికెట్ రెండు తప్పకుండా ఉంటాయి. కాగా సినీ రంగానికి అలాగే క్రికెట్ కి చూసుకున్నట్టయితే రంగాలు వేరే కావచ్చు కానీ ఇంటర్నల్ గా మాత్రం ఎక్కడో ఒక దగ్గర కనెక్షన్ లు కలుస్తాయి. ఇలా ఓ క్రికెటర్ హీరోయిన్ గా డేట్ చేయడం కానీ లేక క్రికెటర్ లే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడం కానీ లేదా సినీమా వారే పలు క్రికెట్ ఈవెంట్స్ లో పాల్గొనడమో ఇలా ఏదొక రకంగా ఈ రెండు ఒక పాయింట్ లో కలుస్తాయి.
కాగా ఈ రెండు రంగాలలో ఉన్నవారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి ప్రైవేట్ స్పేస్ అనేది ఒకటి ఉంటుంది. కనుక వీరు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా కొంచెం ప్రేక్షకుల్లో ఆసక్తిగానే మారుతుంది. ఇక ఇదిలా ఉండగా ఇండియన్ ప్రముఖ స్పిన్నర్ యుజ్వీంద్ర చాహల్ అంటే తెలియని వారు ప్రస్తుత జెనరేషన్ లో ఉండకపోవచ్చు. చూడడానికి బక్కోడే కానీ బరిలో దిగితే తన బౌలింగ్ తో ప్రత్యర్థి బాట్స్ మెన్ ని మట్టు పెడతాడు.

ఇలా క్రికెట్ జర్నీ స్టార్ట్ చేసిన కొన్నాళ్ల లోనే మంచి ఫేమ్ ని తాను అందుకొని ఇపుడు బిజీగా ఉన్నాడు. కాగా తాను కూడా అందరి లానే పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే తాను ధనశ్రీ వెర్మ అనే హిందీ అమ్మాయినే పెళ్లి చేసుకోగా వివాహం గత డిసెంబర్ 22 తో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో వీరి బంధంపై షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరూ ఇపుడు విడాకులు తీసుకోవడం దాదాపు ఖాయం అంటూ గట్టి మాటలు వినిపిస్తున్నాయి. కాగా ధనశ్రీ వెర్మ కోసం సౌత్ లో చాలా తక్కువమందికి తెలిసి ఉండొచ్చు కానీ ఆమె నాట్యకారిని మాత్రమే కాకుండా ఆర్టిస్ట్ కూడా అని చాలా మందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆమె సోషల్ మీడియాలో చూసినట్టు అయితే ఊహించని రేంజ్ హాట్ షోని తాను చూపిస్తుంది.

పెళ్లి అయ్యిన తర్వాత కూడా ఇప్పటికీ తన నుంచి క్రేజీ హాట్ ఫోటో షూట్ లు వస్తూనే ఉంటాయి. కాగా కొన్నాళ్ల కితమే తాను తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. అది కూడా టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి ఆమె హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. కాగా తెలుగులో ఆమె ఆకాశం దాటి వస్తావా అనే సినిమాతో పరిచయం కానుండగా చాహల్ భార్యగా ఒక్కసారిగా అపుడు మంచి హాట్ టాపిక్ గా మారింది.
మరి వీరి పర్శనల్ కారణాలు ఏమో కానీ ఇపుడు మాత్రం ఈ ఇద్దరు సెపరేట్ కావాలని డిసైడ్ అయినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే దీనిపై వారి నుంచి ఓ క్లారిటీ కూడా రావచ్చని పలు పుకార్లు వినిపిస్తున్నాయి. మరి కొన్నాళ్ల కితమే మరో క్రికెటర్ హార్దిక్ పాండ్య కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ ఇంకా అఖండ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ సంబంధించి కూడా పలు రూమర్స్ ఆ మధ్య వచ్చాయి. ఇలా క్రికెటర్స్ విషయంలో మాత్రం మన ఇండియన్ సినిమా దగ్గర పరిస్థితులు ఒకింత ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయని చెప్పాలి.


Click it and Unblock the Notifications











