Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అది అల్లు శిరీష్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు
అల్లు శిరీష్ ఈ మధ్యన ట్విట్టర్ లో చాలా సైలెంట్ గా, చాలా మర్యాదగా ట్వీట్స్ చేస్తున్నాడు. గతంలో ఏ హీరో పడితే ఆ హీరో కత్తి పడితే చూడ్డానికి బాగోదని డైరక్ట్ గా శక్తి సినిమా మీదే కామెంట్ చేసిన అల్లు శిరీష్ లో ఆ ఎగ్రిసివ్ నెస్ కనపడటం లేదు. అంతేగాక దూకుడు, శ్రీరామరాజ్యం చిత్రాల గురించి చాలా పద్దతిగా ట్వీట్స్ ఇచ్చాడు. ఇదంతా గమనిస్తున్న వారు అల్లు శిరీష్ ఓ విధమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడని, అతను గతంలోలో లాగ అదుర్స్, సింహా రికార్డుల గురించి కామెంట్స్ చేసినట్లుగా చేయటం లేదని అంటున్నారు. దానికి కారణం అతను త్వరలో హీరోగా తెరంగ్రేటం చెయ్యటమే చెప్తున్నారు. ఈ నేపధ్యంలో అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ ఇష్టం వచ్చినట్లు రాసి అందరికీ విరోధం కావద్దని అన్నట్లు చెప్తున్నారు. అయితే అల్లు శిరీష్ చాలా సార్లు నిజాయితీగానే ట్వీట్స్ రాసాడని ఆయన ఫాలోవర్స్ అంటూంటారు. తెలుగు సినిమాని నిశితంగా బిజెనెస్ పాయింటాఫ్ వ్యూలో గమనించే అల్లు శిరీష్ ఓ మంచి విశ్లేషుకుడు అని, అతను మాటలు పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూంటారు.
ఇక అల్లు శిరీష్...తెలుగులో సూపర్ హిట్టైన 100% లవ్ చిత్రాన్ని తమిళంలో తననే హీరోగా పెట్టుకుని రీమేక్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. నాగచైతన్య చేసిన పాత్రలో అల్లు శిరీష్ కనిపిస్తారు. ఇక తమన్నానే హీరోయిన్ గా అడగాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు కన్నన్ ఈ చిత్రం డైరక్ట్ చేయటానికి అంగీకరించారని చెప్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితం కానుంది. అందుకోసమే మొదట డబ్బింగ్ చేసి తమిళంలో రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రాన్ని ఆపుచేసారు. ఇక ప్రస్తుతం తమిళంకు సరపడ మార్పులు చేసే పనిలో దర్శకుడు ఉన్నాడని, అల్లు అరవింద్ స్క్రిప్టు ఫైనలైజ్ చేస్తే సెట్స్ కి వెళ్ళి సంక్రాంతికి విడుదల పెట్టుకుందామనే స్పీడులో ఉన్నారు. ఇక 100% లవ్ రీమేక్ చేయటం ద్వారా విజయాన్ని కొనసాగించినట్లు అవుతుందని, మంచి మార్కటింగ్ స్ట్రాటజీగా చెప్తున్నారు. అల్లు శిరీష్ ఈ మద్యనే ముంబైకి చెందిన ఏక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకొచ్చారు. అతనితో రీసెంట్ గా ఫోటో షూట్ కూడా జరిపి తృప్తి చెందినట్లు తెలుస్తోంది.