జూ ఎన్టీఆర్ ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు...?
'సింహాద్రి" తర్వాత హిట్లు రాకపోవడంతో విపరీతమైన ఒత్తిడికి గురయ్యానని, ఆ టెన్షన్ తో ఇంకా బరువు పెరిగిపోయానని, బరువు పెరిగిపోతున్నాననే బాధతో ఇంకా ఇంకా ఊరిపోయానని జూ ఎన్టీఆర్ అప్పట్టో చెప్పాడు. 'రాఖీ" లో తన భారీ కాయానికి కారణాన్ని వివరిస్తూ ఎన్టీఆర్ పై విధంగా చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత 'యమదొంగ" చిత్రానికి న్యూ స్టైల్ కోసం లైపోసక్షన్ చేయించుకుని సన్నబడ్డాడనుకోండి. దాదాపు మూడేళ్ల పాటు స్లిమ్ ఫిజిక్ మెయింటైన్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్లీ ఉబ్బిపోతున్నాడు. కేవలం నెలల వ్యవధిలో ఎన్టీఆర్ పది కిలోలకి పైగా పెరిగిపోయాడు.
యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో చిత్రీకరించబోతున్న 'ఈగ" ప్రారంభోత్సవానికి విచ్చేసిన జూ ఎన్టీఆర్ ని చూసి అంతా 'లావైపోతున్నాడని" చెవులు కొరుక్కున్నారు. టెన్షన్ పడితే ఒళ్లు చేస్తానని చెప్పిన ఎన్టీఆర్ ఇప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన పనిలేదు. మొన్న ఆ మద్య విడుదలైన బృందావనం సక్సెస్ గా హడ్రెండ్ డేస్ వైపు పయనిస్తోంది. మరి దేనికి టెన్ఫన్ పడుతున్నట్టు? అన్నట్టు ఎప్పుడో ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయినా కానీ జూ ఎన్టీఆర్ పెళ్లి ఎందుకని పదే పదే వాయిదా పడుతోంది? అతడు పడుతున్న టెన్షన్ వెనుక రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











