twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య 'మిత్రుడు' కథ ఇదా?

    By Staff
    |

    బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్లో మహదేవన్ రూపొందిస్తున్న మిత్రుడు చిత్రం కథంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం లో ఉంది. రాజేంద్రప్రసాద్ రాంబంటు చిత్రాన్ని పోలి ఉండేటట్లుగా హీరోయిన్ ప్రియమణికి ఈ చిత్రంలో జాతకం ప్రకారం ఓ సమస్య ఉంటుంది. ఆమెను పెళ్ళి చేసుకునే వాడు అకాల మరణం చెందుతాడు. దాంతో ఆమె దానినుంచి తప్పించుకునేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. ముందు వెనుక లేని ఓ వ్యక్తిని ప్రేమించి, పెళ్ళాడి అనంతంరం అతనికి విడాకులు ఇచ్చి(మరణిస్తే సరేసరి)తనకు నచ్చిన సంభందం సెట్ చేసుకుందామని నిర్ణయం చేసుకుంటుంది. అలా ట్రాప్ చేయబడ్డ వ్యక్తి మన బాలయ్య. అయితే అతనితో నిజంగానే ప్రేమలో పడిపోతుంది.అప్పుడేం జర్గుతుందనేది మిగతా కథ అంటున్నారు.

    ఇలా ఫన్ తో ఫ్యామిలీలలకు నచ్చే సెంటిమెంట్ తో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. ఇక ఈ కథ నిజమా కాదా అన్నది తేలాలంటే రిలీజయ్యే దాకా ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో బాలయ్య గతంలో కన్నా చాలా అందంగా కన్పించాడని చెప్తున్నారు. అంటే అభిమానులకు పండగన్నమాట. ఇప్పటికే మణిశర్మ రూపొందించిన మిత్రుడు పాటలు మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే నిర్మాత కూడా దేనికీ తగ్గక నిర్మాణ విలువల్లో రాజీపడక పాటల్లో రిచెనెస్, సన్నివేశాల్లో క్వాలిటీ ఉండేలా కృషి చేసాడనేది అందరిమాట. పాండురంగడు అనంతరం వస్తున్న చిత్రం కావటంతో అన్ని వర్గాల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిత్రుడు...

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X