ఎన్టీఆర్, కాజల్,సమంత ల 'బృందావనం' కథ ఇదేనా?
రేపు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ ... "బృందావనం" చిత్రం కథంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...ప్రకాష్ రాజ్, శ్రీహరి సవతి అన్నదమ్ములు. వారిద్దరకీ ఒకరంటే మరొకరకి పడదు. ఒకే పల్లెలో ఉండే వారిద్దరు మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారికి సమంత, కాజల్ సోదరులు. ఇక కాజల్..పల్లెలో ఉంటుంది. ఆమె పేరు భూమి. భూమి, భూమి చాలా తక్కువగా మాట్లాడుతుంది. భూదేవిలా సహనం, ఓర్పు ఉన్న అమ్మాయి. ఎవరి జోలికీ వెళ్లదు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే అమ్మాయి భూమి.ఇక సమంత..పేరు ఇందు. ఆమె సిటీలో ఉండి చదువుకూంటుంటుంది.
అక్కడే ఎన్టీఆర్ పరిచయమవుతాడు. ఆమెకు కొన్ని విషయాల్లో సాయపడి దగ్గరవతాడు. దాంతో ఆమె అతన్ని ఓ కోరిక కోరుతుంది. తన సోదరి భూమి(కాజల్) కి పెళ్ళి నిర్చయం చేసారని, కాబట్టి అక్కడ కెళ్ళి ఆ పెళ్ళిని చెడకొట్టమంటుంది. దాంతో ఎన్టీఆర్ ..ఆ పల్లెకు వెళ్ళతాడు. అక్కడ తెలివిగా కొన్ని ట్రిక్స్ ఉపయోగించి పెళ్ళి ని తప్పించే పనులు చేస్తాడు. అంతేగాక అక్కడ ఎంతోకాలంగా తెగని కొన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. చివరకు శ్రీహరి, ప్రకాష్ రాజ్ మధ్య వైరాన్ని తప్పించి వారిద్దరినీ కలుపుతాడు. ఆ క్రమంలో కాజల్ ...ఎన్టీఆర్ తో ప్రేమలో పడుతుంది. ఇక సమంత, కాజల్ లలో ఎవరితో ఎన్టీఆర్ ముందుకెళ్ళతాడు...లేదా ఇద్దరినీ కట్టుకుంటాడా అనేది తెరపై చూస్తేనే బావుంటుంది. ఇక ఈ చిత్ర కథ నిజమవ్వటానికి ఎంత అవకాశం ఉందో, కాకపోవటానికి కూడా అంత అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోకండి.


Click it and Unblock the Notifications











