రామ్ చరణ్ 'నాయక్' కథ ఇదేనంటూ...
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా నటించిన 'నాయక్' ఈ నెల 9న విడుదల కానుంది. కాజల్ అగర్వాల్, అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం కథ అంటూ ఓ రూమర్ ప్రచారంలో ఉంది. అది నిజమో కాదో కానీ చాలా స్పీడుగా స్ప్రెడ్ అవుతోంది. ఆ రూమర్ ప్రకారం కథ... శింబు మన్మధని పోలి ఉంటుంది. వారు చెప్పేదాని ప్రకారం.. తమ్ముడు కోసం అన్నయ్య హత్యలు చేస్తూంటాడు.
అయితే ఈ సినిమాకు ఠాగూర్ తరహాలో ఓ బలమైన సామాజిక అంశాన్ని కలపారని,దాంతో అన్ని వర్గాలకు ఇది తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. ముఖ్యంగా చరణ్ పై షూట్ చేసిన యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకుడు. యస్.రాధాకృష్ణ సమర్పిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. యూనివర్శల్ మీడియా పతాకంపై తెరకెక్కిస్తున్నారు. థమన్ స్వరకర్త.
నిర్మాత మాట్లాడుతూ "ఈనెల 9న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యుల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రిపోర్టు వచ్చింది. ఈ సంక్రాంతికి మా సినిమా హిట్ సినిమా అవుతుందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందంగా ఉంది. వినాయక్ టేకింగ్, తమన్ సంగీతం, ఆకుల శివ కథ, మాటలు, కాజల్, అమలాపాల్ అందమైన అభినయం ఈ సినిమాకు హైలైట్ అవుతాయి. 'నాయక్' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది'' అని తెలిపారు.
బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎం.ఎస్.నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, అజాజ్ ఖాన్, సుధ, వినీత్‌కుమార్, సత్యం రాజేష్, శ్రావణ్, గురురాజ్ తదితరులు ఇతర పాత్రధారులు. కథ, మాటలు: ఆకుల శివ, కెమెరా: ఛోటా.కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి, ఫైట్స్: కనల్‌కణ్ణన్, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











