రామ్ చరణ్ 'గోవిందుడు' కథ ఇదేనా?
హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టీ వచ్చే నెల ఒకటవ తేదీన విడుదల కానున్న గోవిందుడు అందరివాడేలే చిత్రం మీద ఉంది. ఈ చిత్రం రామ్ చరణ్ ని మాస్ ఇమేజ్ నుంచి ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఫ్యాన్స్ అయ్యే లా మారుస్తుందని నమ్మకాలు పెట్టుకున్నారు. మెగాభిమానులు మాత్రమే కాక సిని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం కథ అంటూ ఒకటి బయిటకు వచ్చింది.
ఆ కథేమిటంటే.... ఈ చిత్రంలో ప్రకాష్ రాజు పెద్ద మోతుబరి రైతు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఒకడు రహమాన్. రెండవ వాడు శ్రీకాంత్. మొదటి నుంచి శ్రీకాంత్ ...తండ్రి మాట వినకుండా..తిరుగుతూంటే అతన్ని ప్రక్కన పెడతాడు. ఇక పెద్ద కొడుకు రహమాన్ విషయానికి అతన్ని డాక్టర్ చదివిస్తాడు. డాక్టర్ చదివి తన చుట్టు ప్రక్కల ప్రాంతాల వారికి ఉచిత వైద్యం చేస్తాడని భావిస్తాడు.

అయితే డాక్టర్ చదివిన రహమాన్ తను ఇష్టపడ్డ అమ్మాయిని ప్రేమించి లండన్ వెళ్లి అక్కడ డాక్టర్ ప్రాక్టీస్ పెడతాడు. వారి కుమారుడే రామ్ చరణ్. అతను లండన్ లో పెరిగి పెద్దై తన తాత గురించి తెలుసుకుని ఇండియా వస్తాడు. అయితే తనే ఆయన మనవడుని అని చెప్తే ఒప్పుకోడని తన ఐడింటెటీ దాచి ఆయనకు దగ్గర అవుతాడు. అంతేకాకుండా తన బాబాయ్ ని సైతం తన తాతకు దగ్గరయ్యేలా చేస్తాడు.
తన బాబాయ్ శ్రీకాంత్ ప్రేమించిన కమలిని ముఖర్జీ ని దగ్గర చేసి మార్కులు కొట్టేస్తాడు. తర్వాత తన తాతను, తన తండ్రిని, బాబాయ్ ని కలుపుతాడు. ఈ లోగా లోకల్ గా కొందరు తన తాతకు శత్రువులు ఉంటే పనిలో పనిగా వారి పనీ పడతాడు. అక్కడ తన మేనమామ కూతురు కాజల్ తో డ్యూయిట్స్ పాడతాడు. ఇలా తన కుటుంబానికి ఓ ఎన్నారై ఎలా దగ్గరయ్యాడనే విషయం చుట్టూ సినిమా తిరుగుతుంది.


Click it and Unblock the Notifications











