For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ 'నేను..శైలజ' కథ ఇదా?

  By Srikanya
  |

  హైదరాబాద్ :శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం 'నేను..శైలజ'. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తైంది. నేను శైలజ అంటూ తొలిసారి ఓ సాఫ్ట్‌టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తూండటంతో మంచి ఆసక్తి రేపింది. రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారమవుతోంది. ఆ కథను ఇక్కడ మీకు అందిస్తున్నాం. ఈ కథ నిజమో లేక రూమరో... రిలీజ్ రోజు ధియోటర్స్ లో తెలుస్తుంది.

  అందుతున్న సమాచారం ప్రకారం...హరి (రామ్), శైలజ (కీర్తి సురేష్) బాల్య స్నేహితులు. వాళ్ల పేరెంట్స్ ప్రక్క ప్రక్కనే ఉండటంతో వైజాగ్ లో ఒకే స్కూల్ లో చదువుకుంటూంటారు. పిల్లాడుగా ఉన్నప్పుడు హరి... చాలా నాటిగా ఉంటూ..కనపడిన ప్రతి ఆడపిల్లకూ ఐ లవ్ యూ చెప్తూంటాడు..వాళ్లు రిజెక్టు చేస్తూంటారు. ఈ రిజెక్టు చేయటం నుంచి తప్పించుకోవటానికి అతను కేవలం టీచర్స్ కు మాత్రమే ఐలవ్ యూ చెప్తూంటాడు . అలా పెరిగి పెద్దవుతూండగా హరి తండ్రి (నరేష్ ) ట్రాన్సఫర్ అయ్యి తల్లి (ప్రగతి) , సోదరిని తీసుకుని వెళ్లిపోతాడు.

  కొద్ది సంవత్సరాలు గడిచాక హరి తిరిగి వైజాగ్ వస్తాడు. ఈ సారి మళ్లీ శైలజను చూస్తాడు. వీళ్లిద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఒకరినొకరు గుర్తు పడతారు. అయితే తన ప్రేమను ఎక్సప్రెస్ చేయడు...ఆమె ఎక్కడ రిజెక్టు చేస్తుందోనని. అయితే బ్లైడ్ వాళ్లను రోడ్డు దాటించటం వంటివి చేసి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. చివరకు హరికి ఓ రోజు ధైర్యం తెచ్చుకుని ఆమెకు ప్రేమను వ్యక్తం చేయాలనుకంటాడు. అయితే ఈ లోగా ఆమె బంధువులు వచ్చి వచ్చి ఆమె తండ్రి (సత్యరాజ్) దగ్గరకు తీసుకు వెళ్తారు. అలా ఇద్దరూ విడిపోవటంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

  Is it RAM ’S NENU SHAILAJA Story?

  సెకండాఫ్ ఓపెన్ చేస్తే... శైలజా శైలజా అంటూ సాంగ్ తో హరి బాధపడుతూండగా..అతనికి తన చెల్లికి సైతం ఓ లవ్ స్టోరీ ఉందని తెలుస్తుంది. అతను చెల్లిని ప్రేమించింది ప్రిన్స్ (హీరో). ప్రిన్స్ ..మరెవరో కాదు తను ప్రేమించిన శైలజ సోదరుడు. దాంతో ప్రిన్స్ తనకు భగవంతుడు తన ప్రేమను సాధించికోవటానికి పంపిన అవకాసం అని భావించి ... అతని ద్వారా తన ప్రేమను సాధించుకోవాలని చూస్తాడు. ప్రిన్స్ తో నీ ప్రేమ గెలవటానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి..ప్రిన్స్ స్నేహితుడుగా నటిస్తూ అతని గ్రామం వెళ్తాడు. అలా విలేజ్ కు కథ షిప్ట్ అవుతుంది.

  మొత్తానికి శైలజ ఉండే ప్లేస్ కు చేరుకున్న హరి... ఆమె ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించటం మొదలెడతాడు. హరి వలన శైలజ తండ్రి సత్య రాజ్...తన తండ్రి (విజయ్ చందర్) తో ఉన్న విభేధాలు వదిలేసి ఒకటయ్యి...మాట్లాడటం మొదలెడతాడు. ఆ తర్వాత విజయచందర్ సాయింతో మరిన్ని మంచి పనులు ఆ ఇంట్లో హరి చేసి, ఆ కుటుంబ ప్రేమను పొందుతాడు. అప్పుడు అనుకోకుండా ఓ సమస్య వస్తుంది.

  ఆ సమస్య ఏమిటి...హరి ఎలా పరిష్కరించాడు. ఎలా హరి, శైలజ ఒకటయ్యారు అనేది మిగతా కథ. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ తోనూ, సెంకడాఫ్ సెంటిమెంట్ తోనూ సాగినట్లు సమాచారం. రామ్ గత చిత్రాలు శివమ్, పండుగ చేస్కో కన్నా బాగుంది అంటున్నారు. మరి సినీ లవర్స్ ని ఈ చిత్రం ఏ రేంజిలో ఆకట్టుకుంటుందో చూడాలి. రామ్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

  ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్:ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.

  English summary
  Ram, Keerthi Suresh's Nenu Sailaja directed by Kishora tirumala is slated for grand release on Jan 1 offering New Year treat. NenuSailaja movie directed by Kishore Tirumala. Produced by Sravanthi Ravi Kishore under the banner Sri Sravanthi Movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X