twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమా?: 'కాటమరాయుడు' పాటలు విషయమై, అనూప్ పై పవన్ సీరియస్

    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు పై ఓ రూమర్ మొదలై, పవర్ స్టార్ అభిమానులను కలవరపెడుతోంది.

    By Srikanya
    |

    హైదరాబాద్: గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ తాజా చిత్రం'కాటమరాయుడు' పై ఓ రూమర్ మొదలై, పవర్ స్టార్ అభిమానులను కలవరపెడుతోంది. అదేమిటంటే... పవన్ తన తాజా చిత్రం కాటమరాయుడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ పై కోప్పడ్డారు అని చెప్పుకుంటున్నారు. పాటలు బాగా వచ్చాయి...రాలేదు అనే విషయంలో పవన్ సీరియస్ అవ్వలేదుట. పవన్ కు చెప్పిన సమయానికి అనూప్ పాటలు ఇవ్వకపోవటమే కారణం అని చెప్తున్నారు.

    కావాల్సినంత సమయం తీసుకున్నా అనూప్ ..పాటలు ఇవ్వలేకపోయాడని చెప్పుకుంటున్నారు. ప్రతీ పాటకు అనూప్ నెలలు తరబడి సమయం తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే అందుకు కారణం టాలెంట్ లేకపోవటం కాదు..కేవలం అనూప్ బిజి షెడ్యూల్ వల్లే అంటున్నారు.

    అనూప్ చేతిలో ఈ సినిమా కాకుండా మరో ఎనిమిది చిత్రాలు ఉన్నాయి అని, అన్నీ ప్యారరల్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్నారని, ఆ ప్రెజర్ లో పవన్ సినిమాకు సరైన సమయానికి ఇవ్వలేకపోవటం జరుగుతోందని చెప్తున్నారు. ఇదే పవన్ కు నచ్చటం లేదని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకు అద్బుతమైన ట్యూన్స్ ని అనూప్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

    Is it True?: Katamarayudu Songs, Pawan Upset With Anup

    ఇక ఈ తెలుగు సంవత్సరాదికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సంక్రాంతికి కాటమరాయుడు సంక్రాంతి పోస్టర్ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ల కాంబినేషన్లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్, దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం మొదటి టీజర్‌ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు నిర్మాత శరత్ మరార్ తెలిపారు.

    సంక్రాంతి విరామం తరువాత, 16న మొదలయ్యే షూటింగ్, ఏకధాటిగా జరగబోయే షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుంది. సినిమా 2017 మార్చి 29న 'ఉగాది'కి విడుదల కానుంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న కాటమరాయుడు చిత్రానికి నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్ధసాని, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, కళ: బ్రహ్మ కడలి. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు.

    English summary
    Pawan Kalyan has reportedly lost his cool on music director Anup Rubens while working for Katamarayudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X