ప్రకృతి వైపరిత్యాలకు బాలకృష్ణ హిట్స్ కు సంభంధమా?
బాలకృష్ణ చాలా గ్యాప్ తర్వాత సింహా అనే సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చారు.ఇది ఓర్వలేని కొందరు బాలకృష్ణ హిట్స్ కీ, ప్రకృతి వైపరిత్యాలకూ లింక్ పెడుతూ ఓ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం 2001లో నరసింహనాయుడు వచ్చి మెగా హిట్ అయినప్పుడు గుజరాత్ లో భూకంపం వచ్చిందని, అలాగే 2004లో లక్ష్మీ నరసింహా హిట్ టాక్ తెచ్చుకోగానే సునామి వచ్చిందని, ఇక 2010లో సింహా హిట్టు కాగనే లైలా తుఫాన్ వచ్చి అతలాకుతులం చేసిందని అంటున్నారు. అయితే అర్దంలేని ఈ పోలిక బాలకృష్ణ అభిమానులుకు విసుగు తెప్పిస్తోంది. ఏదైనా ఉంటే తమ హీరోలు కూడా సింహా రేంజి హిట్టు సాధించాలని కోరుకోవాలి గానీ ఇలా దారుణంగా మాట్లాడటం సరికాదంటున్నారు.
బాలకృష్ణ సింహా నరసింహనాయుడు బోయపాటి శ్రీను సమరసింహా రెడ్డి simha balakrishna boyapati srinu narasimhanaidu


Click it and Unblock the Notifications