యూనివర్సల్ హీరో అనిపించుకోవడానికా ఈ పోరాటం...
యూనివర్సల్ స్టార్ అనే కొత్త బిరుదు కోసం ట్రై చేస్తున్నాడో, చేతికొచ్చిన ఏ సినిమా అయినా వదులుకోకూడదని ఫిక్సయ్యాడో కానీ జగపతిబాబు ఈ మధ్య ఇండస్ట్రీ వర్గాలకి సైతం సర్ ప్రైజులు, షాకులు ఇచ్చేస్తున్నాడు. ఎన్ కౌంటర్ శంకర్ డైరెక్షన్ లోతెరకెక్కుతోన్న 'జై బోలో తెలంగాణ" చిత్రంలో నటించడానికి సిద్దపడడం ద్వారా ఇండస్ట్రీని ఓ కుదుపుకుదిపేసాడు జగపతి బాబు.
రీసెంట్ గా 'క్షేత్రం" సినిమా ఓపెనింగ్ కి వెళ్లిన వాళ్లని భయపెట్టే గెటప్ తో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ నని చెప్పాడు, అటు తెలంగాణ, ఇటు సీమాంద్ర చుట్టేస్తున్న జగపతి బాబుకి ఎప్పటిలా ఆంధ్రా బ్యాక్ డ్రాప్ సినిమాలుండనే ఉన్నాయి. అయితే తెలంగాణా పేరిట అల్లకల్లోలం జరుగుతున్న తరుణంలో ఆంధ్రవాడయిన జగపతిబాబు ఆ సినిమాలో తెలంగాణా పోరాట యోధుడి పాత్ర పోషించడం చర్చనీయాంశమయింది. ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో అజాత శత్రువుగా ఉన్న పేరుని ఇకపై రాష్ట్రమంతటికీ తెలియజేయాలని అనుకుంటున్నాడో ఏమో తెలీదు మరి. ఈ విధంగా చేయడం వల్ల తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోగలడేమో కానీ ఇదే కారణంగా ఆంధ్రాలో వ్యతిరేకత వస్తే కష్టమేమో ఓ సారి ఆలోచించుకోవాలి.
ప్రస్తుతం పి ఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జగపతి బాబు, విమల రామన్ జంటగా నటిస్తున్న చిత్రం 'చట్టం". 'నీ అబ్బ సొత్తా" అనేది ఉప శీర్షిక. ప్రస్తుతం హైదరాబాద్ లో పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











