తెలుగు హీరో ప్రేమలో జాన్వీ కపూర్.. అతడితో చెప్పలేనంత ఇష్టంతో!
హిందీ సినీ పరిశ్రమ వరుస వైఫల్యాలు చూసిన జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమపై కన్నేసింది. ఇప్పటి వరకు హిందీలో పేరు లేని కుర్రకారు హీరోలతో నటించిన ఈ అందాల బొమ్మ ప్రస్తుతం తెలుగులో స్టార్ యంగ్ హీరోలతో నటిస్తూ భారీ ప్రాజెక్టులను అందుకొంటున్నది. అయితే ఇప్పటికే ముంబైలో చిన్ననాటి స్నేహితుడితో అఫైర్ కొనసాగిస్తున్న శ్రీదేవీ ముద్దుల కూతురు ప్రస్తుతం తెలుగులో ఓ స్టార్ హీరోను చూసి ముచ్చటపడుతున్నదట. జాన్వీ కపూర్ కెరీర్, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, తాజాగా ఓ హీరోకు దగ్గరవుతున్న వివరాల్లోకి వెళితే..
మరాఠీలో ఘన విజయం సాధించిన ఓ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ధడక్ అనే చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాతోనే 100 కోట్ల రూపాయల మూవీలో నటించిందనే పేరు తెచ్చుకొన్నది. అయితే ఇక శ్రీదేవీ వారసత్వాన్ని నిలబెడుతుందని అందరూ ఆశించారు. కానీ ఆమె చేసిన సినిమాలు అటు ఓటీటీలోను ఆకట్టుకొలేక.. ఇటు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.

బాలీవుడ్‌లో ఆమె నటించిన ఘోస్ట్ స్టోరీస్, గంజన్ సక్సేనా, రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవల్, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని, తేరి బాతోంమే ఐసా ఉల్జా జియా సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల కాలంలో సక్సెస్ లేకపోవడంతో కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తెలుగులోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న దేవర చిత్రంలో మంచి పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది. గ్లామర్‌కు, ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె కనిపించబోతున్నదనేది యూనిట్ వర్గాలే కాకుండా ఫిలింనగర్‌లో ఓ టాక్ వినిపిస్తున్నది.

ఇలా ఉండగా, గ్లోబల్ స్టార్ రాంచరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో సుకుమార్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా జాన్వీ కపూర్ నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. ఈ సినిమాతో కూడా భారీ ప్రాజెక్టులో భాగమైంది. ఇలా ఎన్టీఆర్, రాంచరణ్‌తోపాటు మరికొంత మంది కుర్ర హీరోలతో నటించే అవకాశాలపై దృష్టిపెట్టినట్టు సమాచారం.
ఇక దేవర చిత్రంలో తన పాత్రలో లీనమై అద్బుతమైన ఫెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా షూట్‌లో ఎన్టీఆర్ యాటిట్యూడ్, ఫెర్ఫార్మెన్స్ చూసి ముచ్చటపడిపోయిందట. కేవలం నటపరంగానే కాకుండా ఎన్టీఆర్ ప్రవర్తన, ఎదిగినా ఒదిగి ఉండే తీరు చూసి ప్రేమలో పడిపోయినంతగా ఫీల్ అవుతున్నదట. యంగ్ టైగర్ డెడికేషన్ చూసి తన మనసులో ఫీలింగ్స్ చెప్పుకోలేక ఉండలేకపోతుందని దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ ఓ ట్వీట్ వదిలాడు. ఆ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











