పుష్ప 2 లో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఐటెం సాంగ్.. సమంత ఊ అంటావా?ను మించి!

జెనరల్ గా పలు చిత్రాలకి హీరో, దర్శకుడు, ఇంకా సంగీత దర్శకుడు హీరోయిన్ కూడా వంటి అంశాలు ఆడియెన్స్ లో ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంటే తప్ప మినిమమ్ బజ్ ని తెచ్చుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. కాగా ఇలా మన తెలుగు సినిమా దగ్గర హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు పరంగా ఉన్న కొన్ని మ్యూజికల్ క్రేజీ కాంబినేషన్ లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ల మ్యూజికల్ కాంబో అంటే పిచ్చి పీక్స్ లోకి వెళ్లే అంచనాలు ఉంటాయి.

అలానే ఆర్య నుంచి మొదలైన వీరి ప్రయాణం ఆర్య 2 ఆ తర్వాత పుష్ప ఇప్పుడు పుష్ప 2 వరకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో కామన్ గా కనిపించే అంశాల్లో వీరి పేర్లతో పాటుగా వీరి పాటలు కూడా అని చెప్పాలి. ఏ రకమైన సాంగ్ అయినా కూడా వీరి కాంబినేషన్ నుంచి వచ్చింది అంటే అది చార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. ఇక వీరి కాంబినేషన్ లో ఐటెం సాంగ్ అయితే నేషనల్ లెవెల్లో మోత మోగాల్సిందే అని చెప్పాలి.

Is Janhvi Kapoor doing Special Song in Allu Arjun s Pushpa 2

ఎప్పుడో ఆర్య లో కంపోజ్ చేసిన ఆ అంటే అమలాపురం కానీ నెక్స్ట్ ఆర్య 2 లో రింగ రింగ లాంటి సాంగ్ కూడా ఇప్పుడులా ఎలాంటి పాన్ ఇండియా రిలీజ్ లు లేకుండానే హిట్ అయ్యాయి. అలా అప్పట్లోనే అల్లు అర్జున్ హిందీ ఆడియెన్స్ కి పరిచయం అయ్యిపోయాడు. ఇక ఫైనల్ గా పుష్ప ఎలానో పాన్ ఇండియా సినిమా కాబట్టి సామ్ పై చేసిన క్రేజీ హాట్ సాంగ్ ఊ అంటావా మావ సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో ఇంకా పెద్ద హిట్ అయ్యింది.

దీనితో ఇక ఫైనల్ గా పుష్ప 2 ఐటెం సాంగ్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. కాగా ఈ సాంగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. దేవీ ఎప్పుడో ట్యూన్ సిద్ధం చేసి ఉంచుకున్నాడు కానీ ఇంకా చిత్రీకరణ స్టార్ట్ కాలేదు. ఇదెందుకు అంటే మొదటి నుంచి చిత్ర యూనిట్ ఓ హాట్ బాంబ్ తోనే సినిమాలో సాంగ్ చేయాలని డిసైడ్ అయ్యియి కూర్చుకున్నారు కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో అలా ఎదురు చూపులు తప్పలేదు.

Is Janhvi Kapoor doing Special Song in Allu Arjun s Pushpa 2

మరి ఇపుడు ఫైనల్ గా ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూరే. కాగా జాన్వీ తెలుగులో "దేవర" తో ఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఆల్రెడీ పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ కి ఆమెని ఎపుడో సంప్రదించారట. కానీ దేవర తో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం రెండు సినిమాలూ రిలీజ్ డేట్ లు మార్చుకోవడం వంటి వాటి మూలాన ఆమె పుష్ప 2 సెట్స్ లోకి వెళ్లలేకపోయింది.

కానీ ఇపుడు మొత్తానికి అన్నీ సెటిల్ అయ్యేసరికి ఆమె మేకర్స్ కి ఓకే చెప్పడంతో హాట్ సాంగ్ ని మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. మరి లాస్ట్ టైం ఊ అంటావా అంటూ సమంత చేసిన రచ్చకి మించి జాన్వీ కపూర్ రచ్చ పుష్ప రాజ్ తో ఉండబోతుంది అని వినికిడి. ఆల్రెడీ జాన్వీ కపూర్ అందాల ఆరబోతని దేవర రెండో సాంగ్ లో చూసి అంతా షాకయ్యారు. ఇక సుకుమార్, దేవి లాంటి కాంబినేషన్ లో సాంగ్ కి అంటే ఆడియెన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సాంగ్ షూట్ ని అయితే అతి త్వరలోనే మొదలు పెట్టనున్నారట.

More from Filmibeat

Read more about: janhvi kapoor allu arjun pushpa2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X