ప్రియుడితో జాన్వీ కపూర్ ఎంగేజ్‌మెంట్.. తిరుమలలో శిఖర్ పహారియాతో కలిసి శ్రీవారి దర్శనం.. రూమర్లు వైరల్!

అందాల తార, స్వర్గీయ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలాజీ ఆలయంలో శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఆమె బయటకు రావడం, ఆమె వెంట ఉన్న యువకుడు ఎవరా? అనే ప్రశ్న మీడియాలో వైరల్ అయింది.

జాన్వీ కపూర్ వెంట వచ్చిన వ్యక్తి ఆమె ప్రియుడు శిఖర్ పహారియా అనే విషయం మీడియాలో హైలెట్ అయింది. అయితే జాన్వీ, శిఖర్‌కు సంబంధించిన ఓ వార్త మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Janhvi Kapoor Shikhar Pahariya

జాన్వీ కపూర్ సోమవారం ఉదయమే శ్రీవారిని దర్శించుకొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె తన ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి వెంకటేశ్వరస్వామి దర్శించుకొన్నారు. బాలాజీ దర్శనం తర్వాత బయటకు వస్తూ భక్తిశ్రద్దలతో జాన్వీ దేవుడికి మొక్కడం కనిపించింది. ఆలయం భయటకు వచ్చిన తర్వాత కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తిని ప్రదర్శించింది.

జాన్వీ కపూర్‌తో శిఖర్ పహారియా కూడా భక్తి భావాన్ని చాటుకొన్నారు. ఆలయం బయటకు వచ్చి జాన్వీతోపాటు శిఖర్ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. జాన్వీ లంగా, ఓణీలో సంప్రదాయంగా కనిపించింది. శిఖర్ కూడా పంచ కట్టుకొని.. ఒంటిపై చొక్కాలేకుండా కండువా వేసుకొని మరింత సంప్రదాయంగా కనిపించారు.

Janhvi Kapoor Shikhar Pahariya

అయితే తిరుమలలో జాన్వీ కపూర్‌ను చూసిన నెటిజన్లు ఆమె భక్తిభావంపై ప్రశంసలు కురిపించారు. శ్రీదేవి మాదిరిగానే ప్రతీ మూడు నెలలకు ఓసారి శ్రీవారిని దర్శించుకొంటారు. ఆమె శ్రీదేవి అడుగు జాడల్లో నడుస్తున్నారు. తల్లి భక్తిని ఆమె పుణికి పుచ్చకొన్నదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.

అయితే తన ప్రియుడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ తిరుమలకు రావడంపై వివాదాస్పద క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు. జాన్వీ కపూర్, శిఖర్ పహరియా ఇద్దరికి రెండు రోజుల క్రితం ఎంగేజ్‌మెంట్ అయింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత వారిద్దరూ తిరుమలను సందర్శించుకొన్నారు అని ఉమేర్ సంధూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే గతంలో జాన్వీ కపూర్ ఒంటరిగానే వచ్చేసింది. కానీ ఈ సారి దంపతుల మాదిరిగా శిఖర్, జాన్వీ ఇద్దరు కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంగేజ్‌మెంట్ వార్తకు బలం చేకూరింది.

Janhvi Kapoor Shikhar Pahariya

ఇదిలా ఉండగా, జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సంక్రాతి పండుగకు ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X