తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. ఎప్పుడనే విషయంపై దేవర భామ క్లారిటీ

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తన సినిమాల కంటే.. తన అఫైర్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన ప్రియుడు శిఖర్ పహారియాతో అఫైర్ వ్యవహారం నిత్యం మీడియాలో ఏదో ఒక రూపంలో కనిపించేలా చేస్తున్నది. అయితే తాజాగా ఆమె పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలోను, మీడియాలోను ప్రధానంగా కనిపించింది. అయితే తాజాగా తన పెళ్లిపై వచ్చిన వార్తల గురించి ఈ దేవర హీరోయిన్ స్పందిస్తూ..

జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో తన బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వారిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకొని.. ఆయన ఆశీర్వాదం తీసుకొంటారు. అయితే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొంటారనే విషయం వార్త ఆసక్తిగా మారింది.

Is Janhvi Kapoor wants marry Shikhar Pahariya at Tirupathi

ఇక తన తల్లి అమితంగా భక్తిని ప్రదర్శించే కలియుగ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వివాహం చేసుకోవాలని కోరుకొంటున్నారు. ఆమె బంగారు పూతతో ఉండే తన తల్లి చీరెను కట్టుకొని పెళ్లి చేసుకోవాలని అనుకొంటున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకొంటారు అంటూ ఓ వార్తను ప్రచురించారు.

Is Janhvi Kapoor wants marry Shikhar Pahariya at Tirupathi

తన పెళ్లిపై వచ్చిన వార్తపై జాన్వీ సైటైర్లు వేశారు. నా పెళ్లి గురించి నాకే తొందర లేదు. వీళ్లు తమకు తోచినట్టు ఏదేదో రాస్తారు. వీళ్లకు ఎలాంటి వార్తలు రాయాలో.. వారికి ఎక్కడి నుంచి ఇలాంటి సమాచారం లభిస్తుందో తెలియదు అంటూ కామెంట్ చేసింది. ఆమె కామెంట్స్‌కు సోషల్ మీడియాలో మంచి రియాక్షన్ లభిస్తున్నది.

Is Janhvi Kapoor wants marry Shikhar Pahariya at Tirupathi

ఇక జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె హిందీ నుంచి తెలుగు పరిశ్రమకు మెల్లమెల్లగా అడుగులేస్తున్నది. ఆమె ప్రస్తుతం కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినెషన్‌లో వస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. అలాగే రాంచరణ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X