భార్యతో స్టార్ హీరో విడాకులు..ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్‌తో 14 ఏళ్ల కాపురానికి బ్రేకప్

తమిళ సినిమా పరిశ్రమలో మరో విడాకుల వార్త బలంగా వినిపిస్తున్నది. కొద్దికాలంగా స్టార్ హీరో తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే వాటిని వారి సన్నిహితులు, స్నేహితులు కొట్టిపడేశారు. అయితే తాజాగా సదరు హీరో తన ఇన్స్‌టాగ్రామ్ నుంచి భార్య ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు తీసి వేయడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ హీరో విడాకుల వివరాల్లోకి వెళితే..

తమిళ సినిమా పరిశ్రమలో కొన్ని నెలలుగా జయం రవికి ఆయన భార్య ఆరతీకి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. వారిద్దరి విభేదాలను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొన్ని రోజులుగా వారిద్దరూ సపరేట్‌గా ఉంటున్నారు. దాంతో విడాకులు దిశగా వారి అడుగులు పెడుతున్నాయనే వార్తలు కోలీవుడ్‌లో బలంగా వినిపించాయి.

Is Jaya Ravi heading for Divorce with Wife Aarti Here are the proofs

ఇక జయం రవి వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2009 సంవత్సరంలో ఆరతి అనే యువతితో వివాహం జరిగింది. తమిళంలో ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్‌కు ఆమె కూతురు. వివాహం జరిగిన తర్వాత వారిద్దరికి ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో ఆరవ్ ఇటీవల టిక్ టిక్ టిక్ అనే సినిమాలో నటించాడు.

ఇదిలా ఉండగా, విడాకుల వార్తలు ఊపందుకొన్న నేపథ్యంలో జయం రవి తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ నుంచి భార్య, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు తీసివేయడం తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇంకేముంది.. వారిద్దరూ తప్పకుండా విడాకులు తీసుకొంటారనే కథనాలు మీడియాలో కనిపించాయి.

Is Jaya Ravi heading for Divorce with Wife Aarti Here are the proofs

అయితే జయం రవి, ఆరతి తమ ఫ్యామిలీ వ్యవహారాలపై వివరణ ఇస్తే తప్ప ఇలాంటి గాసిప్స్‌కు అడ్డుకట్ట పడే అవకాశం లేదంటున్నారు సినీ వర్గాలు. అయితే ఈ ఊహాగానాలపై జయం రవి స్పందిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. అంతవరకు ఇలాంటి రూమర్లు కొనసాగుతూనే ఉంటాయి.

ఇక జయం రవి విషయానికి వస్తే.. ప్రముఖ ఎడిటర్ మోహన్‌కు కుమారుడు. అలాగే ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాకు సోదరుడు. ఇటీవల ఆయన నటించిన కోమలి, టిక్ టిక్ టిక్, పొన్నియన్ సెల్వన్, ఇరైవన్, సిరెన్ లాంటి చిత్రాలు ఓటీటీలో, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకొన్నాయి.

More from Filmibeat

Read more about: jayam ravi aarti kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X