భార్యకు విడాకులు ఇచ్చి.. సింగర్‌తో టాప్ హీరో అఫైర్?
ప్రముఖ ఎడిటర్ మోహన్‌కు కుమారుడు. అలాగే ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజాకు సోదరుడు. ఇటీవల ఆయన నటించిన కోమలి, టిక్ టిక్ టిక్, పొన్నియన్ సెల్వన్, ఇరైవన్, సిరెన్ లాంటి చిత్రాలు ఓటీటీలో, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకొన్నాయి. దక్షిణాదిలో ఆయన నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్నారు. అయితే ఇటీవల తన దాంపత్య జీవితానికి సంబంధించిన విషయంలో వార్తల్లో నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే..
సినీ హీరో జయం రవి వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 2009 సంవత్సరంలో ఆరతి అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకొన్నారు. తమిళంలో ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్‌కు ఆమె కూతురు. వివాహం జరిగిన తర్వాత వారిద్దరికి ఇద్దరు కుమారులు కలిగారు. అన్యోన్యంగా సాగుతున్న తరుణంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. వారి విభేదాలను పరిష్కరించడానికి పెద్దలు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో ఇటీవల అధికారికంగా కోర్టు నుంచి విడాకులు తీసుకొన్నారు.

డైవోర్స్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రకటనను రిలీజ్ చేస్తూ.. జీవితమనే పుస్తకంలో ఎన్నో చాప్టర్లతో నిండి ఉంటుంది. ప్రతీది ఓ అవకాశం.. ఓ ఛాలెంజ్‌ను విసురుతుంది. నా సినిమా కెరీర్‌ను, నా వ్యక్తిగత జీవితాన్ని మీరంతా ఎంతో ప్రేమతో అనుసరించి ఎంతో సపోర్ట్ ఇచ్చారు అందులో ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేవు అని పేర్కొన్నారు.
15 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత నా భార్యతో విడిపోవాలన్న నిర్ణయం తొందరపడి తీసుకోలేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకొన్నాం. ఇద్దరికి ప్రయోజనం కలిగే విధంగా విడిపోవాలని అనుకొన్నాం. మా వైవాహిక జీవితంలో జరిగిన ఈ సంఘటనపై ఎలాంటి ఊహాగానాలకు తావు లేదు అని జయం రవి తెలిపారు. ఈ క్రమంలో మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని ఆయన పేర్కొన్నారు.

అయితే విడాకుల నేపథ్యంలో జయం రవిపై కొన్ని రూమర్లు ఊపందుకొన్నాయి. వివాహేతర సంబందం వల్లనే జయం రవి కాపురంలో కలతలు చోటు చేసుకొన్నాయి. అందుకు కారణం బెంగళూరుకు చెందిన ఓ గాయని అనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే బెంగళూరుకు చెందిన కెనీషా ప్రాన్సిస్‌తో డేటింగ్ రూమర్లపై వస్తున్న వార్తలపై జయం రవి తీవ్రంగా స్పందిస్తూ ఖండించారు. విడాకుల తర్వాత గోవాలో ఆమెతో జయం రవి కనిపించారనే వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలియకుండా ఆమె గురించి తప్పుడు రాతలు రాయడం సరికాదు అని ఆయన అన్నారు. అయితే తాను క్లారిటీ ఇచ్చినా వారిద్దరి అఫైర్‌పై సోషల్ మీడియాలో రూమర్లు గుప్పమంటున్నాయి.


Click it and Unblock the Notifications











