Remuneration: ప్రభాస్‌తో ఎన్టీఆర్ పోటీ.. ప్రశాంత్ నీల్ మూవీకి యంగ్ టైగర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
జూన్ 27 న కల్కి సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్నారు. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న నటుడు ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ రేంజ్ లో ఉన్నాడు. అయితే ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ ఇప్పటికే ప్రతీ సినిమాకు భారీ రెమ్యునరేషన్‌తో ఏరియా హక్కులు తీసుకొంటున్నారని ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. బాహుబలి, సాహో సినిమాల తర్వాత దాదాపు 120 కోట్ల రూపాయలకు అటు ఇటుగా రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్‌లో డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

పాన్ ఇండియా సినిమాల విషయంలోనూ రెమ్యూనరేషన్ విషయంలోనూ ప్రభాస్ ఫ్యాన్స్ గా మేము గర్విస్తున్నాం అంటూ ఇప్పటికే చాలామంది కాలర్లు ఎగరేస్తున్నారట. అయితే తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే రెమ్యూనరేషన్ విషయంలో ప్రభాస్‌తో పోటీ పడుతున్నారు అని ట్రేడ్ రిపోరట్.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమా కోసం ఏకంగా 130 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. రీసెంట్గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి మూవీ మేకర్స్ స్పెషల్ అప్డేట్ ని అందించారు.

ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభించనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ తెలిపారు. ఇప్పటికే వార్ 2, దేవర లాంటి బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అప్పటికి ఈ సినిమా షూటింగులో పూర్తి చేసుకుంటారని సమాచారం. వార్ 2 మూవీ ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్.


Click it and Unblock the Notifications











