జూ ఎన్టీఆర్ ‘దేవర’కు అవమానం.. ఎవరూ ముందుకు రావడం లేదా?
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత నుంచి తారక్ భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. జూ ఎన్టీఆర్ లైనప్ కూడా షాకింగ్ ఉంది. ఇండియాలోనే టాప్ హీరోగా కీర్తి పొందుతూ బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ అందరి దృష్టి తనపైనే నిలిచేలా చేస్తున్నారు తారక్. ఇక జూ ఎన్టీఆర్ చివరిగా నటించిన చిత్రం 'దేవర పార్ట్ :1'. కొరటాల శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి దివంగత శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
2024 సెప్టెంబర్ 27న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. తెలుగులో రూపుదిద్దుకున్నప్పటికీ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి రిజల్ట్ నే చూసింది. కమర్షియల్ సక్సెస్ అందుకుంది. కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేపోయింది. జూ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ కు సరిపోయేలా సౌండ్ రాలేదని సినీ పండితులు తేల్చారు. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియాలో థియేట్రికల్ రన్ లో సక్సెస్ అయ్యింది.

అలాగే జపాన్ లో కూడా విడుదలై దుమ్ములేపింది. మాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. భారీ చిత్రం దేవర పార్ట్ 1 విడుదలై 7 నెలలు దాటినా ఈ మూవీకి ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోలేదనే టాక్ వినిపిస్తోంది. కేవలం డిజిటల్ రైట్స్ ను మాత్రమే అమ్మారని, శాటిలైట్ రైట్స్ ను ఇంత వరకు అమ్మకుండా ఉంచడం వెనకాల రీజన్ ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు.
మేకర్సే కావాలని రైట్స్ ఇవ్వడం లేదా? లేదంటే భారీగా డిమాండ్ చేయంతో ఎవరూ ముందుకు రావడం లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకోవడం విశేషం. ఏకంగా రూ.155 కోట్లకు అమ్ముడు పోయింది. 2024 నవంబర్ 24న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఏడు నెలలు కావస్తున్నా ఇంకా శాటిలైట్ రైట్స్ ను అమ్మకంపోవడం హాట్ టాపిక్ గ్గా మారింది.
మరోవైపు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దేవర పార్ట్ : 2 చిత్రం కూడా షూటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎన్టీఆర్ నుంచి బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2' కూడా త్వరలో రాబోతోంది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఏప్రిల్ 22న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'డ్రాగన్' చిత్రం షూటింగ్ లో జాయిన్ అయ్యారు.


Click it and Unblock the Notifications











