సలార్ 2 ఆపేసి.. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ.. ఎంత కథ జరిగిందంటే?
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర చాలా మంది స్టార్ హీరోలే ఉన్నారు. అయితే ఒకొక్కరికి ఒకో పంథా ఉంటుంది. ఒక హీరో ఉన్నట్టుగా దాదాపు మరో హీరో ఉండడు. సో ఇలా చాలా మంది మంచి ప్రజాదరణను సొంతం చేసుకుని తమ ఇండస్ట్రీస్ ని లీడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోస్ తమ మార్కెట్ ని చాలా సీరియస్ గా తీసుకుంటే ఇంకొందరు తమకి వచ్చిన పని లోనే ఎంత వీలయితే అంత చేసుకొని వెళ్లిపోతుంటారు.
అలాగే ఇదే తరహాలో కొందరు స్టార్ హీరోలు ఈ దర్శకునితో వర్క్ చేయాలని తామే అడగడమో లేక నిర్మాతలతో అడిగించడమో చేస్తూ ఉంటారు కానీ ఇంకొందరు దర్శకులు తమంత తామే ఈ హీరోకి తగ్గ కథలు రాయాలని వారే అప్రోచ్ అవుతారు. మరి ఈ రెండు కేటగిరీలలో మొదటి కేటగిరీకి చెందిన హీరో కోసమే ఇప్పుడు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది.

కాగా ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆరే.. ఎన్టీఆర్ కి అపారమైన టాలెంట్ ఉంది ఇది ఎవరూ కాదనలేని సత్యం. కానీ ఎన్టీఆర్ ఇన్నేళ్ల కెరీర్ లో చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కానీ ఒక టైం లో మాత్రం తను ఈ దర్శకునితో వర్క్ చెయ్యాలని కథలు రాయండి నేను రెడీ అంటూ పలు సందర్భాల్లో చెప్పాడు. ఉదాహరణకి రాజమౌళి తోనో లేక దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా కోసమో ఓపెన్ గానే నాతో ఎప్పుడు సినిమాలు చేస్తారు అంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
అయితే ఇలా ఓ హీరో తనకోసం తానే ఇలా అడగడం అనేది ఇతర హీరోల ఫ్యాన్స్ లో కొంచెం అలుసుగా అనిపిస్తుంది. కానీ తనకే ఎలాంటి ఇబ్బంది లేదు నా టాలెంట్ వాడుకోండి అని ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడని చాలా తక్కువ మందే అనుకుంటున్నారు. మరి ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పై కొన్ని షాకింగ్ వార్తలు వస్తున్నాయి. పోస్ట్ RRR సినిమా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది.

దీనితో ఈ క్రేజ్ ని ఎలాగైనా కాపాడుకోవాలని ఎన్టీఆర్ ట్రై చేస్తున్నాడు. అలానే ఎప్పుడు నుంచో ఆలస్యం అవుతూ వస్తున్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలి అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై బాగా ఒత్తిడి తెచ్చాడు అంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రశాంత్ కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా ఓకే చేసారు కానీ అది కాస్తా అలా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇంకా ప్రశాంత్ నీల్ కి తన పర్శనల్ ఫెవరెట్ సినిమా అయినటువంటి "సలార్" (ఉగ్రం రీమేక్) సీక్వెల్ ని తీసేయాలని ప్లాన్ చేసాడు కానీ తనతో ఓకే చేసుకున్న సినిమా ఆలస్యం అవుతుంది అని ఎన్టీఆర్ మాత్రం ఊరుకోలేదట. అందుకే నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమా స్టార్ట్ చేయించాల్సిందే అన్నట్టుగా సూచించాడట. అందుకే ఇప్పుడు హుటాహుటిన వీరి కాంబినేషన్ లో సినిమా నేడు అనౌన్స్ అయ్యినట్టుగా కొన్ని పుకార్లు ఈ క్రేజీ కాంబినేషన్ పట్ల వినిపిస్తున్నాయి. దీనితో మరోసారి ఎన్టీఆర్ ఈ విషయంలో వైరల్ గా మారాడు.


Click it and Unblock the Notifications











