యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పెళ్లి కబుర్లు...
మాస్ హీరోగా ఇంతకాలంవ మాస్ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే రిలీజైన 'బృందావనం" చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరైన ఆనందంలో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'శక్తి" షూటింగ్ లో బిజీగా వున్నాడు. కాగా ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహం ఈ నవంబర్ లో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ పెళ్లి మాత్రం నవంబర్ లో జరగడం లేదు మార్చిలో ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేసి అనంతరం నూతనోత్సాహంతో సినిమాలు చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అన్నట్లు ఎన్టీఆర్ 'శక్తి" చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. పెళ్లి, హనీమూన్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయునున్నట్టు సమాచారం.
జూ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి బృందావనం శక్తి ఇలియానా కాజల్ సమంత jr ntr lakshmi pranathi brindavanam shakti ileana kajal samantha


Click it and Unblock the Notifications