ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. కంగారులో నందమూరి ఫ్యాన్స్
ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా లోనే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి హీరోస్ లో వెరీ టాలెంటెడ్ హీరో అందులోని మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో నందమూరి తారక రామారావు కూడా ఒకడు. తాత సీనియర్ ఎన్టీఆర్ పోలికలు పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా తారక్ షేక్ చేసాడు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో వరల్డ్ వైడ్ ఫేమ్ ని కూడా తెచ్చుకున్నాడు.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ విషయంలో ఫ్యాన్స్ కి ఇప్పుడు కొన్ని అంశాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. ఏ హీరో అభిమాని అయినా కూడా ఓ భారీ సినిమాలో లేదా స్టార్ దర్శకుడుతో మెయిన్ హీరోగా లేదా సోలో సినిమా అయితే సోలో హీరోగా చెయ్యాలి అని కోరుకుంటారు అంతే కానీ మెయిన్ హీరో ఇంకొకరు ఐతే ఆ హీరోకి సహాయ నటుడుగానో లేదా సైడ్ హీరో గానో కనిపించాలి అని కోరుకోరు.

కానీ సరిగ్గా తారక్ ఇదే చేస్తున్నాడు అని చెప్పాలి. కాగా ఎన్టీఆర్ నటించిన గత చిత్రం RRR సినిమా చూసిన తర్వాత అందులో ఎవరి పాత్ర ఏంటి ఎవరు మెయిన్ లీడ్ ఎవరు ఎవరు ఆ మెయిన్ లీడ్ కి పక్క పాత్రలో కనిపించారు అనేది అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే RRR అనే సినిమా రామ్ చరణ్ తోనే హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత తనకి సహాయపడే మరో రోల్ ఉందని దానికి ఎన్టీఆర్ ని తీసుకున్నారు.
దీనితో ఇక్కడ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తన వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన మొదటి రోజు తోనే చాలా క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ సినిమా తర్వాత మరో భారీ సినిమా అది కూడా బాలీవుడ్ సినిమా ఎంట్రీ అంటూ తారక్ నుంచి అనౌన్సమెంట్ వచ్చింది. కాగా ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ చేసేది సెకండ్ హీరో గానే తప్ప మెయిన్ లీడ్ లో కాదు. ఎందుకంటే ఆల్రెడీ వార్ 1 అనే సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా కనిపించాడు.

సో పార్ట్ 2 లో కూడా హృతిక్ రోషన్ నే మెయిన్ లీడ్ గా కనిపిస్తాడు తప్పితే తాను సైడ్ హీరోగా కనిపించడు. మరి మళ్ళీ ఇదొక దెబ్బ అయితే తాజాగా మరో స్టేట్మెంట్ ఎన్టీఆర్ నుంచి వచ్చింది. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. కన్నడ సినిమాలో సెన్సేషనల్ హిట్ అయ్యిన డివోషనల్ డ్రామా "కాంతార" కోసం మన అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఇప్పుడు కొనసాగింపు చిత్రాన్ని దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి చేస్తునాడు.
మరి ఇందులో కూడా మెయిన్ హీరో రిషబ్ శెట్టినే తప్పితే మరొకరు కాదు అని అందరికీ తెలుసు. కాగా ఇందులో కూడా నటించేందుకు సిద్ధమే అంటూ తారక్ తాజాగా కన్నడ మీడియాతో తెలియజేసాడు. దీనితో అసలు మరో హీరో సినిమాలో ఇలా వేరే పాత్రలు చేయడానికి ఎన్టీఆర్ కి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉందో ఇపుడు చాలా మందికి అర్ధం కావడం లేదు.

కొందరు ఫేడ్ అవుట్ అవుతున్న సీనియర్ హీరోస్ ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తుంటే అంత స్టార్డం ఉంచుకొని ఎన్టీఆర్ కి ఇదేం అవసరం అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి నిజంగానే రిషబ్ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడో లేదో కానీ మరో హీరో సినిమాలో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో కనిపించడం మాత్రం ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్ దగ్గర ట్రోల్స్ కి అవకాశం ఇచ్చినట్టుగా అయ్యిపోతుంది. మరి దీనిపై తారక్ దృష్టి పెట్టి లైనప్ ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











