టాలీవుడ్ స్టార్ హీరోతో అలియాభట్..సూపర్ ఏజెంట్‌గా భారీ స్పై థ్రిల్లర్!
పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో సినీ తారలు ఇతర భాషల్లో నటించే అవకాశం కలుగుతున్నది. హిందీ స్టార్స్ తెలుగు, తమిళంలో, దక్షిణాది భాషల నటులు బాలీవుడ్‌లో నటించేలా ఆఫర్లు భారీగానే ఉంటున్నాయి. అయితే తాజాగా ఆలియాభట్ ఇటీవల RRR మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్ర లేకపోవడం వల్ల ఆమెతోపాటు ఆమె అభిమానులు కూడా నిరాశకు లోనయ్యారు. అయితే తాజాగా మరోసారి పాన్ ఇండియా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ కాబోతున్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై థ్రిల్లర్ష్ సినిమాలను భారీగా నిర్మిస్తున్నది. గతంలో వచ్చిన చిత్రాలకు సీక్వెల్‌గా రూపొందిస్తూనే కొత్త ప్రాజెక్టులతో రెడీ అవుతున్నది. ఈ క్రమంలో వార్ 2 సినిమాను బిగ్ స్కేల్‌లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే వార్ 2 సినిమాను కొనసాగిస్తూనే యష్ రాజ్ ఫిల్మ్స్ మరో స్పై థ్రిల్లర్ సినిమాను రెడీ చేసింది. ఈ చిత్రంలో ఆలియాభట్ కీలక పాత్రలో కనిపిస్తారని ఇటీవల చిత్ర యూనిట్ సభ్యుడు కన్ఫార్మ్ చేశారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తోపాటు స్టార్ యాక్టర్లతో నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. దాంతో ఆలియా భట్ మరోసారి బిగ్ ప్రాజెక్టులో భాగం కానున్నారు.
ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఎన్టీఆర్ పాల్గొనే సీన్లను చిత్రీకరించనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాను కొనసాగిస్తూనే ఆలియాభట్, శర్వారీ వా నటించే స్పై థ్రిల్లర్‌లో నటించేందుకు యంగ్ టైగర్ ఒప్పుకొన్నారనే వార్త మీడియాలో చర్చనీయాంశమైంది.

అయితే ఆలియాభట్ నటించే స్పై థ్రిల్లర్‌లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారనే వార్తలు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే మరోసారి వీరిద్దరూ RRR సినిమా తర్వాత మళ్లీ కలిసి నటించడం జరుగుతున్నది. సూపర్ ఏజెంట్స్ కాన్సెప్ట్‌తో రూపాందే సినిమాలో వీరిద్దరి కలిసి నటిస్తే అభిమానులకు పెద్ద పండుగే అనే మాట వినిపిస్తున్నది. ఈ వార్త నిజమేనా? కాదా? అనేది కొద్ది రోజులు ఆగితే తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











