Kalki 2898 AD లో ప్రభాస్ అర్జునుడు.. కల్కి పాత్రకు ఆ స్టార్ హీరో? అదే జరిగితే థియేటర్లు బద్దలవ్వడం ఖాయం!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కల్కి 2898 AD. పురాణాలను, భవిష్యత్ కాలపు సాంకేతికతను జోడించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను సీ అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో కల్కి ఎవరనే విషయంలోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతోపాటు రూపొందిన ఈ సినిమా అంతే భారీ అంచనాలతో జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చిన్న దేశాల్లోను ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

ఇక కల్కి చిత్రం గత 40 రోజుల్లో ఇండియన్ సినిమా చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను అలాగే ఓవర్సీస్‌లోను బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ఇప్పటికే 1150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక కల్కి సినిమా కథ విషయానికి వస్తే.. అశ్వత్తామకు శ్రీకృష్ణుడు శాపం కారణంగా భూమిపై జీవిస్తూనే ఉంటాడు. కల్కి రూపంలో తాను జన్మించిన తర్వాత మీకు విమోచనం కలుగుుతందని శాప విముక్తి గురించి చెబుతాడు. అలా కల్కి జననం కోసం అశ్వత్తామ వేచి చూస్తుంటాడు. ఇక కల్కి జన్మించకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతుంటాయి.

ఇక కల్కి చిత్రం క్లైమాక్స్‌లో అశ్వాత్థమ ముందుకు వచ్చి తాను అర్జునుడిని అని ప్రభాస్ చెప్పుకొంటాడు. అప్పటి వరకు ప్రభాస్ కల్కి అని భావించిన వారంతా ఆశ్చర్యపోతారు. అయితే ఇక పార్ట్ 2, పార్ట్ 3ల కల్కి ఎవరనే విషయంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతన్నది. అయితే కల్కి పాత్ర కోసం స్టార్ హీరోను రంగంలోకి దించే ప్రయత్నాన్ని వైజయంతీ మూవీస్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇక దీపిక పదుకోన్ కడుపులో పెరుగుతున్న బిడ్డనే కల్కి అవతారం అనే విషయం అర్ధమైంది. కల్కి పాత్రను ఎవరు పోషిస్తున్నారనే విషయానికి వస్తే.. ఆ పాత్రను ఎన్టీఆర్ చేయడానికి సిద్దమవుతున్నట్టు ఓ కథనం వినిపిస్తున్నది. అయితే ఎన్టీఆర్‌తోపాటు మరో స్టార్ హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. అతనే పవన్ కల్యాణ్. ఒకవేళ పవన్ కల్యాణ్ ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ ఫిక్స్ అనేది విషయం మీడియాలో చర్చ జరుగుతున్నది. ఒకవేళ పవన్ ఒప్పుకొంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











