Kantara 2 కాంతార 2లో జూనియర్ ఎన్టీఆర్.. కన్నడ ఇండస్ట్రీలో అలజడి సృష్టిస్తున్న న్యూస్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. RRR తర్వాత క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేసుకొంటూ కెరీర్ గ్రాఫ్‌ను ఓ రేంజ్‌లో పరుగులు పెట్టించేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత అభిమానులకు దాదాపు రెండేళ్లు దూరంగానే ఉండటంతో ఆయన సినిమాల కోసం ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టిన ఆయన భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.. ఆ వివరాల్లోకి వెళితే..
కన్నడ సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేసిన మూవీ కాంతార 2. ఈ సినిమాలో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార దేశవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్లకు వరకు కలెక్షన్స్ ని నమోదు చేసింది.

ఇక ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో.. మేకర్స్ దీనికి కొనసాగింపుగా మరో సినిమాని తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. అయితే అది సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ పనులు మొదలు పెట్టుకున్న ఈ ప్రీక్వెల్ నుంచి ఇటీవల ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ప్రీక్వెల్‌పై ప్రేక్షకులకి ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ చిత్రాన్ని భారీగా తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ మూవీలోని ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను అభిమానించే రిషబ్ శెట్టి.. టైగర్‌తో మంచి స్నేహానే ఏర్పరుచుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కన్నడ వెళ్లి రిషబ్ శెట్టిని, ప్రశాంత్ నీల్‌ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. మరి ఆ మీటింగ్ వెనుక కారణం.. కాంతార 2లోని రోల్ గురించి కూడా కావొచ్చని తెలుస్తుంది.
మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, కన్నడ మీడియా అండ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు అయితే.. ఈ వార్త నిజమైతే బాగుండు అని ఆశ పడుతున్నారు. మరి వీరి ఆశలు నిజమవుతాయో లేదో చూడాలి. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో.. దేవర రెండు పార్టులు, వార్ 2, బాలీవుడ్ స్పై యూనివర్స్ లో ఓ ప్రాజెక్ట్‌తో పాటు NTR31 సినిమాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











