Balakrishna-Jr.NTR: ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్ .. నందమూరి ఫ్యాన్స్ కు పునకాలే

Balakrishna-Jr.NTR: నందమూరి అభిమానులకు శుభవార్త. నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇంతకీ ఆ షో ఏంటి? వీరిద్దరూ స్టార్ ఒక్కే వేదికపై ఎంటర్టైన్ చేయబోతున్నారట. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ విషయాల్లో ఏంటో ఓ లూక్కేద్దాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పటికి కూడా వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతున్నారు. ఆయన కేవలం సినిమాలో మాత్రమే కాకుండా షో లలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన డబిడి దిబిడి డైలాగ్స్ తో వచ్చే గెస్టులను రోస్ట్ చేస్తుంటారు. తమ ప్రశ్నలతో ఇరకాటంతో పడేస్తాడు బాలయ్య.

Is Junior NTR come as a guest on Unstoppable with NBK talk show hosted by Nandamuri Balakrishna

నందమూరి బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న 'అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే' టాక్ షో చాలా పాపులర్ అయింది. ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ టాక్ షో ఇప్పటివరకూ మూడు సీజన్లు విజయవంతంగా రన్ చేశారు. పాపులర్ టాక్ సంపాదించుకున్నారు. తాజాగా నాలుగో సీజన్ మొదలైంది. ఈ షో దసరా సందర్బంగా స్ట్రీమింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ను ఇప్పటికే షూట్ చేశారట. అక్టోబర్ 24 నుంచి ఆహాలో సీజన్ 4 ప్రసారం కాబోతున్నాయి. ఈ షో కు సంబంధించిన ప్రోమోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ షో నుంచి ఓ
ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

ఈ సీజన్లో వచ్చే గెస్ట్ లు ఎవరు? అనేది ఇంట్రెస్టింగ్ మారింది. ఈ షోలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గెస్టులుగా వచ్చే అవకాశముందట. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ను ఆహ్వానించే అవకాశముందట. అదే విధంగా డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ మరోసారి సమాచారం. అలాగే.. ఈ సీజన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గెస్ట్ గా రాబోతున్నారట. ప్రస్తుతం ఈ గెస్టుల గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సినిమాల వరకు నందమూరి ఫ్యాన్స్ అంతా ఒక్కటే అయినా.. ఫ్యామిలీ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వేరు. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల నందమూరి బాలయ్య ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నందమూరి వారసుడు ఎవరు అనే విషయంపై .. తన కొడుకు.. తన మనుమడే వారసులు అని షాకింగ్ కామెంట్స్ చేసింది విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో మరోసారి భేదాభిప్రాయాలు ఉన్నాయనే అంశం మరో సారి తెరపైకి వస్తోంది.

ఈ నేపథ్యంలో నందమూరి బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న 'అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే' టాక్ షోలో జూనియర్ ఎన్టీఆర్ గెస్టుగా వస్తే.. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సమాధానాలిస్తారో ? అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X