Jr NTR బాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు మరో భారీ ఆఫర్.. వార్ 2 రిలీజ్‌కు ముందే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పటి నుంచో వేచి చూస్తున్న విషయం. అయితే కొన్ని కథలు సెట్ కాక, సెట్ అయిన ప్రాజెక్టులు ఏదో కారణంగా పట్టాలెక్కకపోవడంతో ఆయన ఎంట్రీ వాయిదా పడింది. కానీ తాజాగా ఓ బారీ ప్రాజెక్టులో మల్టీస్టారర్‌గా రూపొందుతున్న వార్ 2 సినిమాలో కీలక పాత్రతో హిందీ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..

వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన సంగతి అందరికి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ గా కనిపించబోతున్నాడు. అంతేకాకుండా స్పై యూనివర్స్‌కి ఎన్టీఆర్ థానోస్ లా డేంజరస్ విలన్ కాబోతున్నాడంటూ ఇన్నాళ్లు వార్తలు వినిపించాయి.

Is Junior NTR signed another Spy Universe Movie as Raw Agent after War 2

అయితే ఇప్పుడు బాలీవుడ్ ఫిలిం వర్గాల నుంచి వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్‌గా నటించబోతున్నారంట. వార్ 2 సినిమాలో కేవలం ఓ ముఖ్య పాత్రతో సర్‌ప్రైజ్ చేసే ఎన్టీఆర్.. ఆ తరువాత YRF స్పై యూనివర్స్‌‌లో రా ఏజెంట్ పాత్రతోనే సపరేట్ మూవీ చేయబోతున్నారట.

ఈ క్రమంలోనే ఇప్పటికే యష్ రాజ్ సంస్థకి ఎన్టీఆర్ సైన్ కూడా చేసేసినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే.. ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీని గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది.

Is Junior NTR signed another Spy Universe Movie as Raw Agent after War 2

కాగా ఈ వార్ 2 షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. గత ఏడాది స్పెయిన్ లో ఎన్టీఆర్, హృతిక్ లేకుండా వారి డూఫ్‌లతో కార్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. ఇక ఈ వారం నుంచి హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. జపాన్‌లో ఈ షెడ్యూల్ జరగనుందట. అక్కడ షావోలిన్ టెంపుల్ నేపథ్యంలో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతునట్లు వినిపిస్తుంది. ఇక ఈ మూవీ సెట్స్ లోకి ఎన్టీఆర్ వచ్చే నెలలో అడుగుపెట్టనున్నారట.

దేవర షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్.. ఏప్రిల్ నెలలో వార్ 2 కోసం కొన్ని రోజులు కేటాయించినట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంటే.. జాన్ అబ్రహం, శార్వరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X