స్టార్ హీరోకి దెబ్బేసింది ఎవరో కాదా? తన భార్యే అసలు విలన్??
మామూలుగా ఏ మగాడి విజయం వెనుక ఖచ్చితంగా ఓ స్త్రీ ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే ఇంకొందరు అయితే ఓ మగాడి నాశనం వెనుక కూడా ఓ ఆడదే ఉంటుంది అని అంటుంటారు. అయితే ఎవరి కోణంలో వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అది వాళ్ళ పర్శనల్ కానీ ఇలాంటివి మాత్రం సినీ ప్రముఖులు విషయంలో మాత్రం బయటకి వస్తే అవి కొంచెం ప్రత్యేకంగా మారుతాయి.
కాగా సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ తమ కో స్టార్స్ ని పెళ్లి చేసుకున్నవారు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఆ స్టార్స్ లో కొందరు అయితే తమ ప్రొఫిషినల్ , పర్సనల్ లైఫ్ లని కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తు ఉంటారు. ఉదాహరణకి మన తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు ఇదే కోవకి చెందినవారే. మహేష్ కూడా తన సినిమాలు ఇతర బ్రాండింగ్స్ వంటివి తన భార్యే చూసుకుంటుంది అని ఎన్నోసార్లు తెలిపాడు.

అయితే వీరి లైఫ్ ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా కొనసాగుతుంది కానీ ఓ స్టార్ జంట విషయంలో మాత్రం ఆ హీరో అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యి ఉన్నారు. కాగా ఆ హీరో అండ్ హీరోయిన్ జంట రియల్ లైఫ్ భార్య భర్తలు ఎవరో కాదు తమిళ నటుడు సూర్య, జ్యోతికలు అట. ఈ ఇద్దరూ సినిమాల్లో నటిస్తూ నిర్మాణం కూడా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా జ్యోతిక చేసిన స్టేట్మెంట్ పై విమర్శలు వస్తున్నాయి.
ఆమె మాట్లాడుతూ నా సినిమాలు నేను డిసైడ్ చేస్తాను నా భర్త సూర్య చేసే సినిమాలు మాత్రం నేనూ తను(సూర్య) డిసైడ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చింది. దీనితో సూర్య సినిమాల కంట్రోల్ జ్యోతిక చేతిలో ఉంది అందుకే గత కొంతకాలంగా ఆయన సినిమాలు భారీ ప్లాప్స్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా సూర్య నటించిన లేటెస్ట్ సినిమా "కంగువా" ఎన్నో అంచనాలు నడుమ వచ్చి వాటికి తగ్గ పెర్ఫామెన్స్ చేయలేక డిజప్పాయింట్ చేసింది. దీనికి ముందు వచ్చిన సినిమా ఈటి(ఎవరికీ తలవంచడు) కూడా భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో సూర్య సినిమాల విషయంలో జ్యోతిక కలుగజేసుకోకుండా ఉంటే మంచిది అని సూర్య ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ జంటని ఇష్టపడే వారు మాత్రం ఈ సినిమాలకి ముందు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ లాంటి సినిమాలు కూడా జ్యోతిక ప్రమేయం తోనే వచ్చినట్టే కదా సో ఆమెని అనడానికి ఏమి లేదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇందులో కూడా లాజిక్ ఉంది. కానీ జ్యోతిక స్టేట్మెంట్ మాత్రం కంగువా రిజల్ట్ విషయంలో ఆమెని విలన్ ని చేసేసింది అని చెప్పక తప్పదు. మరి విక్రమ్ సినిమాలో సాలిడ్ క్యామియో ఇచ్చిన సూర్య నుంచి మళ్ళీ రోలెక్స్ సినిమా పడితే గాని తనకి కం బ్యాక్ పడేలా లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











